శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 12 జులై 2018 (16:40 IST)

నువ్వే నా సర్వస్వం .. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా... డైవర్ వైఫ్

ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంది. ప్రతిక్షణం.. చాలా ఉత్కంఠతో ప్రపంచంలోని కళ్లన్నీ ఆ గుహ వైపే చూశాయి. ఎప్పుడు గుహ నుంచి చిన్నారులు బయటకు వస్తారో అని అందరిలో ఉత్కంఠ. చివరకు సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్

ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంది. ప్రతిక్షణం.. చాలా ఉత్కంఠతో ప్రపంచంలోని కళ్లన్నీ ఆ గుహ వైపే చూశాయి. ఎప్పుడు గుహ నుంచి చిన్నారులు బయటకు వస్తారో అని అందరిలో ఉత్కంఠ. చివరకు సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన థాయ్‌లాండ్.. లుయాంగ్ గుహలో నుంచి మంగళవారం చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది.
 
ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ డైవర్లు పాలుపంచుకున్నారు. చిన్నారులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో దురదృష్టవశాత్తూ సిలిండర్‌లో ఆక్సిజన్ అయిపోవడంతో థాయ్‌లాండ్ మాజీ నేవీ సీల్ సమర్న్ కునన్‌ (38) మృత్యువాతపడటం ప్రతి ఒక్కరినీ కన్నీరుపెట్టించింది. ఆయన చనిపోవడానికి ఆ చిన్నారులే కారణమనే విమర్శలూ చెలరేగాయి. 
 
దీనిపై కునన్ భార్య వలీపోన్ పుట్టెడు దుఃఖంలోనూ తన భర్త చనిపోవడానికి కారణం గుహలో చిక్కుకున్న చిన్నారులు కాదని, వారిని ఎవరూ నిందించవద్దని ప్రాధేయపడింది. తన భర్తతో కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వలీపోన్.. ఇకపై నేను ఉదయాన్నే లేచి ఎవర్ని చూడాలి? నువ్వే నా సర్వస్వం, నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానంటూ అంటూ ట్వీట్ చేసింది. 
 
ఈ ట్వీట్‌ను చూసిన ప్రతి నెటిజన్ బాధాతప్తహృదయంతో రీట్వీట్ చేస్తున్నారు. 'సమర్న్ చూపించిన ధైర్యసాహసాలు ఎప్పటికీ మర్చిపోలేనివని, దేవుడు మీకు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నామంటూ' లక్షలాదిమంది నెటిజన్లు తమ ట్వీట్ల ద్వారా వలీపోన్‌‌కి మద్దతు తెలుపుతున్నారు. అదేసమయంలో లుయాంగ్ గుహకి సమర్న్ పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.