ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 7 జులై 2018 (15:25 IST)

స్పైడర్ మ్యాన్ కో-సృష్టికర్త ఇకలేరు...

స్టీవ్ డిట్కో.. ఈయన స్పైడర్ మ్యాన్ కో-సృష్టికర్త. ఈయన శనివారం ఉదయం కన్నుమూశారు. ఈయన వయసు 90 ఏళ్లు. న్యూయార్క్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. డిట్కో మృతి పట్ల ప్రఖ్యాత రచయిత నీల్ గేమన్ నివాళి అర్పించారు. మ

స్టీవ్ డిట్కో.. ఈయన స్పైడర్ మ్యాన్ కో-సృష్టికర్త. ఈయన శనివారం ఉదయం కన్నుమూశారు. ఈయన వయసు 90 ఏళ్లు. న్యూయార్క్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. డిట్కో మృతి పట్ల ప్రఖ్యాత రచయిత నీల్ గేమన్ నివాళి అర్పించారు. మార్వెల్ కామిక్స్ కోసం డిట్కో పనిచేశారు.
 
1960 దశకం తొలి రోజుల్లో ఆయన ప్రపంచంలోనే అద్భుతాన్ని సృష్టించాడు. ఫేమస్ స్పైడర్‌ మ్యాన్ క్యారక్టర్‌ను డిజైన్ చేశారు. డాక్టర్ స్ట్రేంజ్ క్యార్టకర్ రూపకల్పనలో కూడా డిట్కో పనిచేశారు. మార్వెల్ కామిక్స్ సీఈవో స్టాన్ లీ ఇచ్చిన ఐడియాకు ఆయన ప్రాణం పోశారు.
 
సాలీడు శక్తులతో టీన్ సూపర్‌ హీరోను క్రియేట్ చేయాలని లీ సూచించాడు. దానికి తగ్గట్టుగా స్పైడర్‌మ్యాన్ వేషధారణను డిట్కో డెవలప్ చేశాడు. బ్లూ, రెడ్ డ్రెస్‌తో పాటు మణికట్టులో వెబ్ సూటర్స్ ఉన్న స్పైడర్‌ మ్యాన్‌ను డిట్కో డిజైన్ చేశాడు.