Daily Horoscope
✕

ప్రియుడి చేతిలో టెక్కీ హత్య.. మోసం చేసిందని గోడకు తలను బాదాడు.. రాత్రంతా శవం పక్కనే...?

Written By సెల్వి
Updated: బుధవారం, 25 నవంబరు 2026 (09:45 IST)
Lover
పూణేలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి చేతిలో టెక్కీ హత్యకు గురైంది. మహారాష్ట్రలోని పూణే జిల్లా, హింజవాడిల చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విప్రోలో పనిచేస్తున్న కోమల్ రాజేంద్ర దహకే (27) హత్యకు గురయ్యారు. కోమల్, ఇన్ఫోసిస్ ఉద్యోగి శుభం కల్బండే ప్రేమ సంబంధంలో ఉన్నారు. 
 
వారిద్దరూ పక్కపక్కనే ఉన్న పేయింగ్ గెస్ట్ వసతి గృహాలలో నివసించేవారు. కోమల్ తనను మోసం చేసిందనే అనుమానంతో శుభం తరచుగా ఆమెతో గొడవపడేవాడు. ఈ క్రమంలో ఆ యువతి అతనితో కలిసి రాత్రి భోజనానికి బయటకు వెళ్లింది. 
 
కోమల్ తన పీజీ వసతి గృహానికి తిరిగి వచ్చిన తర్వాత, వారిద్దరూ మళ్లీ గొడవపడ్డారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ వివాదం తీవ్రరూపం దాల్చింది. దీంతో ఆవేశానికి గురైన శుభం ప్రియురాలితలను గోడకు బాది హత్య చేశాడని ఆరోపణలు ఉన్నాయి.

నిందితుడు రాత్రంతా మృతదేహం పక్కనే కూర్చున్నాడు. ఉదయం శుభం అంబులెన్స్‌కు ఫోన్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.
About Author
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... Read More

అన్నీ చూడండి

King 100 Update: నాగార్జున కింగ్100 స్టైలిష్ కౌంట్‌డౌన్ పోస్టర్‌తో విడుదల ఖరారు

Vijay Antony: నాన్న కుట్టి అందరికీ నచ్చేలా ఉంటుంది : విజయ్ ఆంటోని

నీ కలను నెరవేరుస్తా, బిగ్ బాస్ బ్యూటీతో సల్మాన్ ఖాన్

తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ధనుష్ వెల్ఫేర్ యూనిట్లు

Vijay Sethupathi :ఎమ్మీ అవార్డుల ప్రదానోత్సవంలో తొలి భారతీయ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి

తర్వాతి కథనం
Show comments