శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 21 మే 2017 (11:43 IST)

రాజీవ్ గాంధీ 26వ వర్ధంతి... సోనియా - మన్మోహన్ నివాళులు

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 26వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన సమాధి వీర్‌భూమికి కాంగ్రెస్ అధినేత్రి, రాజీవ్ సతీమణి సోనియా గాంధీ, ఆయన కుమారుడు రాహుల్ గాంధీతో పాటు.. కుమార్తె ప్రియాంకా గాంధీ, మాజీ

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 26వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన సమాధి వీర్‌భూమికి కాంగ్రెస్ అధినేత్రి, రాజీవ్ సతీమణి సోనియా గాంధీ, ఆయన కుమారుడు రాహుల్ గాంధీతో పాటు.. కుమార్తె ప్రియాంకా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లు నివాళులు అర్పించారు. 
 
ఈ సందర్భంగా రాజీవ్ సేవలను కొనియాడారు. కొంత సమయం అక్కడే గడిపి అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలాగే ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు, మరికొందరు ప్రముఖులు రాజీవ్‌కు ఘనంగా నివాళులర్పించారు. 1991లో తమిళనాడులోని శ్రీపెరంబదూరులో మే 21న ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణించిన సంగతి తెలిసిందే.