సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 మార్చి 2022 (15:06 IST)

పంజాబ్ ఎన్నికల్లో బాలీవుడ్ నటుడు సోనూసూద్ సోదరి ఓటమి

పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల ముందే హేమాహేమీలైన నేతలు ఓడిపోయారు. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఓడిపోయారు. సిట్టింగ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ కూడా ఓటమి అంచుల్లో ఉన్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సోదరి మాళవిక కూడా ఓడిపోయారు. 
 
గురువారం చేపట్టిన ఓట్ల లెక్కింపులో ఆప్ పార్టీ అభ్యర్థులు విజయబావుటా ఎగురవేస్తున్నారు. 117 సీట్లకు గాను ఆప్ అభ్యర్థులు ఏకంగా 91 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 17, బీజేపీ 2, ఇతరులు మూడు చోట్ల ఆధిక్యం లేదా గెలుపు బాటలో ఉన్నారు. 
 
ఇదిలావుంటే, మెగా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె ఆప్ అభ్యర్థి డాక్టర్ అమన్ దీప్ కౌర్ చేతిలో ఏకంగా 58,813 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మాళవికకు కేవలం 31,125 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈమె కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.