శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 16 ఫిబ్రవరి 2019 (13:38 IST)

క్లాస్ రూమ్‌లోనే తాళికట్టేశాడు.. అంతా లవర్స్ డే ఎఫెక్ట్...

అంతా లవర్స్ డే ఎఫెక్ట్. క్లాస్ రూమ్‌లోనే పదో తరగతి అబ్బాయి.. తన తోటి విద్యార్థిని మెడలో తాళి కట్టేశాడు. వివరాల్లోకి వెళితే, తమిళనాడు విలుప్పురం జిల్లాకు చెందిన మాంబళంపట్టు గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో 600 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి తన తోటి విద్యార్థిని ప్రేమించాడు. 
 
కానీ ఆ బాలుడు తన ప్రేమను అంగీకరించకపోవడంతో.. ఇక లాభం లేదనుకున్నాడు. చివరికి లంచ్ టైమ్‌లో ఆమె మెడలో తాళి కట్టేశాడు. అన్నం తింటున్న తన మెడలో తాళికట్టేయడం చూసిన బాలిక షాక్ అయ్యింది. ఆపై ఏడుస్తూ ఇంటికెళ్లింది. తన తల్లిదండ్రులకు ఈ విషయం తెలిపింది. దీంతో ఆవేశానికి గురైన బాలిక తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
అంతేగాకుండా బాలిక తల్లిదండ్రులు.. క్షణికావేశంలో బాలుడు కట్టిన తాళిని బాలిక మెడ నుంచి తీసేసారు. ఇక పాఠశాల యాజమాన్యం బాలుడిని పాఠశాల నుంచి సస్పెండ్ చేసింది.