గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By
Last Updated : గురువారం, 14 ఫిబ్రవరి 2019 (15:36 IST)

''లవర్స్ డే'' రివ్యూ రిపోర్ట్.. ప్రియా ప్రకాష్ వారియర్ లీడ్ రోల్ కాదా?

ప్రేమికుల రోజు సందర్భంగా వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన ''లవర్స్ డే'' సినిమా విడుదలైంది. గత ఏడాది ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమాలోని ఓ కన్నుగీటిన సన్నివేశం వైరల్ అయ్యింది. ఈ సన్నివేశాన్ని ప్రియా ప్రకాష్ వారియర్ పండించింది. కన్నుగీటి సెలెబ్రిటీగా మారిపోయింది. అలాగే ముద్దు గన్నును పేల్చి ఎన్నో కోట్ల హృదయాలకు గాయం చేసిన ఈ అమ్మడు సోషల్‌మీడియా క్వీన్‌గా మారిపోయింది. 
 
క్రేజీ డైరెక్టర్ ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాతలు ఎ. గురురాజ్‌, సి. హెచ్‌. వినోద్‌రెడ్డి సుఖీభ‌వ సినిమాస్ బ్యానర్‌పై అందిస్తున్నారు. ''ఒరు ఆదార్ లవ్'' పేరిట మలయాళంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ''లవర్స్ డే'' పేరుతో డబ్ చేశారు. ప్రియా ప్రకాష్ వారియర్‌ సోషల్ మీడియా రారాణిగా మారడంతో..ఆ క్రేజ్ దృష్ట్యా తెలుగు, మలయాళంతో పాటు కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం ఏకకాలంలో విడుదల చేశారు. ఈ సినిమా రివ్యూ ఎలా వుందో ఓసారి చూద్దాం.. 
 
నటీనటులు : రోషన్, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, నూరీన్‌ షరీఫ్‌ తదితరులు
సంగీతం : షాన్‌ రెహమాన్‌ 
దర్శకత్వం : ఒమర్‌ లులు
నిర్మాత :  ఎ.గురురాజ్, సి.హెచ్‌. వినోద్‌ రెడ్డి. 
 
కథలోకి వెళ్తే.. స్కూల్ డేస్, ప్రేమ, రొమాన్స్, జోకులు వంటి అన్నీ అంశాలూ లవర్స్ డేలో వుంటాయి. రోషన్, హాధ స్నేహితులుగా మొదలై ప్రేమికులుగా మారిపోతారు. కానీ వారి ప్రేమను వ్యక్త పరచాలనుకునే సమయానికి అనూహ్య ఘటన జరుగుతుంది. అదేంటి.. ఇంతకీ రోషన్, గాధ ఒక్కటయ్యారా..అనేది తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే.
 
విశ్లేషణ..
రోషన్‌ బాగా నటించాడు. ఇందులో ప్రియా ప్రకాష్ వారియర్ మెయిన్ లీడ్ కాదు. గాధ పాత్రలో నటించిన నూరిన్ షరీఫ్.. ప్రియా కంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది. అందం, అభినయంతో నూరీన్ ఆకట్టుకుంటుంది. హీరో స్నేహితులు, లెక్చరర్, ప్రిన్సిపాల్ పాత్రలు ఆకట్టుకున్నాయి. ప్రియా ప్రకాష్ వారియర్ కూడా నటన పరంగా ఆకట్టుకుంది. 
 
కొన్నిచోట్ల నటనాపరంగా మరింత రాణించి వుంటే బాగుండేది. మిచెల్ అన్ డానియల్ నటనా పరంగా అదరగొట్టింది. సంగీతం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు పర్వాలేదనిపిస్తాయి. టెక్నికల్ విలువలు బాగున్నాయి. సంగీతం, నిర్మాణ విలువలు బాగున్నాయి. లవ్లీ సాంగ్స్, బీజీఎమ్ అదిరింది. సినిమాటోగ్రఫీ బాగుంది. అచ్చు విజయ్ ఎడిటింగ్ క్లీన్ అండ్ నీట్‌గా వుంది. 
 
ఇక ప్రేమను విషాదంగా ముగించాడు దర్శకుడు. ప్రేమకు ఆకర్షణకు వున్న తేడాను అర్థం చేసుకుని ప్రేమను ఆ అమ్మాయి చెప్పే సందర్భంలో ఆ పాత్రకు ముగింపు పలికాడు. అసలు దర్శకుడు ఏం చెప్పదలచుకున్నాడో అర్థం కాదు. ట్విస్టులు, టర్నింగ్ పాయింట్లు ఇందులో లేవు. హిట్ మేకర్ అయిన ఒమర్ లులు క్యూట్ లవ్ స్టోరీగా లవర్స్ డేని తెరకెక్కించాడు. కానీ డైరక్షన్ విధానంలో ఇంకొన్ని మార్పులు చేయకుండా వదిలేశాడు. స్క్రీన్ ప్లేపై ఇంకా శ్రద్ధ పెట్టి వుంటే ఈ సినిమా మరింత రిచ్‌గా వుండేది.
 
రేటింగ్ 2.2/5