గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. మధుర జ్ఞాపకాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (11:50 IST)

ఈ రోజు ఎవరికైనా ప్రపోజ్ చేయవచ్చు...ఎందుకంటే?

ప్రేమ మాటలకందని తియ్యని అనుభూతి. ప్రేమలో పడని, ప్రేమను ఆశించని వ్యక్తి ఎవరూ ఈ ప్రపంచంలో ఉండరు. ఎంత గొప్ప వ్యక్తి అయినా ఏదో ఒక దశను ప్రేమను దాటుకునే వచ్చుంటారు. అలాంటి ప్రేమికుల కోసం ఫిబ్రవరి 14న ప్రతి ఏడాది ప్రేమికుల దినోత్సవాన్ని జరపడం ఆనవాయితీగా మారింది.


ఒక వారం ముందు నుండే ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు అయిన రోజ్ డే, ఆ రోజున ప్రేమికులు ఒకరికొకరికి రోజూ పూలు ఇచ్చి పుచ్చుకుంటారు, ఇందులో ఒక్కో రంగు రోజా ఒక్కోదానికి సంకేతంగా భావిస్తారు.
 
ఈ ఏడాది వేలంటైన్ వీక్ మొదలైపోయింది. నిన్ననే ప్రేమికులు రోజ్ డే సెలిబ్రేట్ చేసుకున్నారు. ఇక ఇవాళ రెండో రోజు అనగా ప్రపోజ్ డే. ఈ రోజున ప్రేమికులు ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తపరుచుకుంటారు.

కొత్తగా తమ ప్రేమను ప్రపోజ్ చేయాలనుకునేవారు ఈ రోజు కోసం ఎదురుచూస్తుంటారు, అంతేకాకుండా ఇప్పటికే ప్రేమించుకుంటున్నవారు మరోసారి తమ ప్రేమను ఒకరికొకరు చెప్పుకుని వారి ప్రేమ బంధాన్ని మరింత పదిలం చేసుకుంటారు. మరికొంత మంది సర్‌ప్రైజ్ బహుమతులతో తమ ప్రేమను వ్యక్తం చేస్తారు.