మోదీ సభకు వెళ్తుండగా ప్రమాదం.. తమిళనాడు స్పీకర్‌కు గాయాలు
ప్రధాని నరేంద్రమోదీ ప్రచారసభకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, అన్నాడీఎంకే నేత పీ ధనపాల్ ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారును వెనుక నుంచి వస్తున్న మరో వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పీకర్ ధనపాల్‌కు గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మంగళవారం ధారాపురంలోని సూరియనల్లూర్ టోల్ గేట్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో స్పీకర్ ధనపాల్‌తోపాటు ఆ రాష్ట్ర మంత్రి ఎస్పీ వేలుమణి కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.