గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 జులై 2020 (17:33 IST)

వేదనిలయంలో నాలుగు కిలోల బంగారం, 601 కిలోల వెండి.. ఇంకా..?

తమిళనాడు మాజీ సీఎం జయలలిత నివాసమైన పోయస్ గార్డెన్ (వేదనిలయం)లో వున్న సామాగ్రికి సంబంధించిన జాబితాను తమిళనాడు సర్కారు విడుదల చేసింది. అమ్మ అని పిలువబడే జయలలిత నివాసాన్ని స్మారక మందిరంగా మార్చనున్నట్లు ఇటీవలే ప్రకటించిన తమిళ సర్కారు.. ప్రస్తుతం అందుకు సంబంధించిన కార్యాచరణను ప్రారంభించింది. ఈ క్రమంలో పోయెస్ గార్డెన్‌లో వున్న వస్తువులను లెక్క కట్టింది. 
 
ఈ నేపథ్యంలో పోయెస్ గార్డెన్‌లో నాలుగు కిలోల బంగారం, 601 కిలోల వెండి వున్నట్లు అధికారులు ఆ జాబితాలో పేర్కొన్నారు. వేద నిలయం ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన తరుణంలో.. రూ.36 కోట్ల మేర దివంగత సీఎం జయలలిత ఆదాయపన్ను చెల్లించాల్సి వుందని.. వేదనిలయాన్ని సీజ్ చేసేందుకు అనుమతించాలని హైకోర్టులో ఐటీ శాఖ పేర్కొంది. కానీ తమిళ సర్కారు గట్టిగా పోరాడటంతో పోయెస్ గార్డెన్‌ను వేదనిలయంగా మార్చి.. జయలలిత స్మారక మందిరంగా మార్చాలని నిశ్చయించింది. 
 
అంతేగాకుండా.. వేద నిలయం కోసం ఆదాయ పన్ను శాఖకు రూ.67.90 కోట్లను సిబిల్ కోర్టులో డిపాజిట్ చేసింది. ఇకపోతే.. తాజాగా జయలలిత ఇంట్లో ఏమున్నాయనే వివరాలను తమిళ సర్కారు ప్రకటించింది. దీనిప్రకారం, వేదనిలయంలో 4 కిలోల బంగారం వున్నట్లు తెలిపింది.

ఇంకా 601 కేజీల వెండితో పాటు 32వేల 721 వస్తువులు, 11 టీవీలు, 38 ఏసీలు, 29 సెల్‌ఫోన్లు, డ్రైవింగ్ లైసెన్సులు, ఆదాయ పన్ను వివరాలతో కూడిన 653 పత్రాలు, దుస్తులతో పాటు 10వేల 448 వస్తువులు, 8376 పుస్తకాలు వున్నట్లు తమిళ సర్కారు ప్రకటించింది.