మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 18 ఆగస్టు 2020 (19:30 IST)

నేను గర్భవతినని చెప్పిన ప్రియురాలు, సరే అలా వెళ్లి మాట్లాడుకుందాం రా అని పిలుచుకెళ్లి?

వారిద్దరు ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకరినొకరు విడిచి ఉండలేదు. యువతికి పెద్ద దిక్కు లేరు. తాత దగ్గరే ఉండేది. ప్రియుడిని నమ్మింది. సర్వస్వం అర్పించింది. అయితే ఆమె జీవితంతో ఆడుకున్నాడు ప్రియుడు. గర్భవతి చేయడమే కాకుండా.. గర్భాన్ని తీయించుకోలేదన్న కోపంతో ప్రియురాలిని అతి దారుణంగా చంపేశాడు.
 
మహారాష్ట్రలోని పుణేకి చెందిన రంజన్ వావ్‌లో కిరన్ ఫండే అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన 24 సంవత్సరాల యువతితో ప్రేమాయణం నడిపాడు. సంవత్సరం నుంచి వీరి ప్రేమాయణం నడుస్తోంది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కిరన్ ఫండే స్థానికంగా ప్రొవిజన్ షాపు ఓనర్.
 
యువతికి తాత తప్ప ఎవరూ లేదు. కిరన్ ఫండే ఇంట్లో అడ్డు చెప్పే వారు లేరు. దీంతో ఇద్దరి మధ్య ప్రేమయాణం సంవత్సరం సాగింది. కిరణ్ మంచితనం యువతి తాతకు కూడా బాగా నచ్చింది. దీంతో ఆయన నుంచి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఎలాగో పెళ్ళి చేసుకుంటాడని యువతి నమ్మింది.
 
అతనితో శారీరకంగా కలిసింది. ఫలితంగా గర్భం దాల్చింది. తను గర్భవతిని అయ్యానన్న విషయాన్ని కిరన్ ఫండేకు చెప్పింది. అయితే మొదట్లో సైలెంట్‌గా ఉన్న కిరన్ ఆ తరువాత తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. ఆ యువతిని చిత్రహింసలు పెట్టాడు.
 
నీ గర్భానికి నాకు ఎలాంటి సంబంధం లేదని, నిన్ను పెళ్ళి చేసుకోనన్నాడు. దీంతో ఇద్దరి మధ్యా తరచూ గొడవ జరిగేది. మొన్న సాయంత్రం ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు. ఊరి బయట ఇద్దరి మధ్యా గొడవ జరగడంతో కోపంతో ఊగిపోయిన కిరన్ ఫండే ఆమెను రాయితో తలపై మోది చంపేశాడు. ఆ తరువాత అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు సమాచారం అందించడంతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.