గురువారం, 30 నవంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 21 నవంబరు 2022 (12:04 IST)

ఫ్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చిన గూడ్సు రైలు... ముగ్గురి మృతి

goods train
ఒరిస్సా రాష్ట్రంలో గూడ్సు రైలు ప్రమాదం జరిగింది. ఈ రాష్ట్రంలోని జాజ్‌పూర్ జిల్లా కొరాయి స్టేషనులో ఈ ప్రమాదం జరిగింది. గూడ్సు రైలు ఒకటి ఫ్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. దీంతో కొన్ని బోగాలు ఫ్లాట్‌ఫాంపై బోల్తాపడ్డాయి. 
 
సోమవారం ఉదయం 6.44 గంటల ప్రాంతంలో కొరాయి స్టేషన్‌లో గూడ్సు రైలు పట్టాలు తప్పిడంతో మొత్తం 54 బోగీల్లో 10 బోగీలు బోల్తాపడ్డాయి. ఇవి స్టేషన్‌లోకి చొచ్చుకుని వెళ్లాయి. 
 
ఆ సమయంలో రైలుకోసం వేచివున్న ప్రయాణికుల్లో ముగ్గురు మృత్యువాతపడ్డారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు బోగీల కింద చిక్కుకున్నారు. 
 
ఈ ప్రమాదం చూసిన రైల్వే సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అలాగే బోగీల కింద చిక్కుకున్న మరికొందరిని రక్షించారు.