శుక్రవారం, 1 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 మార్చి 2022 (10:11 IST)

కాంగోలో రైలు ప్రమాదం - 61 మంది దుర్మరణం

ఆఫ్రికా దేశాల్లో ఒకటైన కాంగో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 61 మంది మృత్యువాతపడ్డారు. మరో 52 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
 
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలోని ఆగ్నేయ కాంగో కొల్వేజి నగరానికి 200 కిలోమీటర్ల దూరంలో బయోఫ్వే వద్ద ఈ ప్రమాదం సంభవించింది. రైలు పట్టాలు తప్పడంతో ఏడు బోగీలు పక్కనే ఉన్న లోయలో పడిపోయాయి. 
 
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. అయితే, చనిపోయినవారిలో చాలా మృతదేహాలు బోగీల్లోనే చిక్కుకునివున్నాయి.
 
నిజానికి ఇది గూడ్సురైలు. మొత్తం 15 వేగన్లు ఉన్న ఈ గూడ్సురైలులో 12 బోగీల్లో వదలాది మంది ప్రయాణికులు ఎక్కారు. ఈ గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం సంభవించింది.