మంగళవారం, 19 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 జూన్ 2025 (16:42 IST)

Honeymoon: హనీమూన్‌కి వెళ్లిన మరో నవ దంపతులు.. ఏమయ్యారో తెలియట్లేదు..?

Honeymoon couple
Honeymoon couple
రాజ రఘవంశీ, సోనమ్‌ల హనీమూన్ ట్రాజెడీ మరవక ముందే.. మరో ఇన్సిడెంట్ సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన నవ దంపతులు సిక్కింలోని తీస్తా నదిలో కనిపించకుండా పోయారు. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. 
 
వివరాలను పరిశీలిస్తే.. యూపీలోని ప్రతాప్‌గఢ్ జిల్లాకు చెందిన కౌశలేంద్ర ప్రతాప్‌ సింగ్‌కు అంకితా సింగ్‌ అనే యువతితో హనీమూన్‌ కోసం మే 24న సిక్కిం వెళ్లారు. ఈ నవ దంపతులు పలు ప్రాంతాల్లో తిరిగారు. మే 29న వారు ప్రయాణిస్తున్న కారుపై కొండ చరియలు విరిగిపడ్డాయి. 
 
ఇక కొండ చరియలు విరిగి పడటంతో ఆ కారు 1,000 అడుగుల లోతున్న నదిలో పడిపోయింది. డ్రైవర్‌ మృతి చెందాడు. గల్లంతైన మరో 8 మంది ఆచూకీ కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక, అటవీ శాఖ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. 
 
ఈ ఘటన జరిగి దాదాపు 12 రోజులు అయినా.. ఇంకా ఎలాంటి అప్డేట్ లేదని నవ వరుడు కౌశలేంద్ర ప్రతాప్ సింగ్ తండ్రి షేర్ బహదూర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.