శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 ఏప్రియల్ 2022 (22:38 IST)

కుమార్తె కోసం వెతికితే.. వేరొక వ్యక్తితో తోటలో ఏకాంతంగా..?

crime scene
యూపీలో మైనర్ కుమార్తె కనపడలేదని ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. అంతే ఊరంతా వెతికాడు. కానీ ఓ తోటలో ఓ వ్యక్తితో ఏకాంతంగా గడుపుతున్న కుమార్తెను చూసి షాకయ్యాడు. వెంటనే అతను ఆగ్రహంతో ఊగిపోయి కూతురిని హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. యూపీలోని మహరాజాగంజ్ జిల్లా కోల్పుయికు చెందిన ఓ మైనర్ బాలికను ఓ యువకుడు మాయ మాటలు చెప్పి బుట్టలో వేసుకున్నాడు. ఆ విషయం ఆ బాలిక తండ్రికి తెలిసి వారిద్దరికీ వార్నింగ్ ఇచ్చాడు.  
 
ఇటీవలే ఒకరోజు తన కూతురు కనిపించలేదు. ఎక్కడ వెతికినా కనిపించలేదు. చివరకు ఊరవతల ఉన్న ఓ తోటలో ఆ యువకుడితో ఏకాంతంగా గడుపుతుండగా చూసి షాకయ్యాడు. 
 
వెంటనే ఆగ్రహంతో ఆమె గొంతు నులిమి హత్య చేసి కాలువలో పడేశాడు. ఇంతలో ఆ యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపారు. విచారణలో తండ్రే కూతురుని హత్య చేశాడని తేలింది. వెంటనే బాలిక తండ్రితోపాటు యువకుడిని అరెస్ట్ చేశారు.