ఆది పురుష్‌లో మరో నాయికగా వుందా!
ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్రం ప్రోగ్రెస్ గురించి చిత్ర యూనిట్ పలురకాలుగా వార్తలు విడుదల చేస్తోంది. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. రామాయణ కథను ఆదర్శంగా తీసుకుని సోషలైజేషన్ చేస్తూ తీస్తున్న చిత్రంగా చిత్ర వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ రామునిగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ సీతా దేవి పాత్రలో నటిస్తుంది. మిగతా పాత్రలలో అన్ని భాషలనుంచి పలువురు నటిస్తున్నారు.
కాగా, ఇప్పుడు మరో ప్రధాన పాత్రలో సోనాల్ చౌహన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే బాలీవుడ్‌లో ఓ ఇంటర్వ్యూలో ఆమె తన పాత్రల గురించి చెబుతూ ఆదిపురుష్ గురించి చెప్పినట్లు తెలుస్తోంది. కథ ప్రకారం లక్ష్మణుడు భార్యగానో ఆమె వుండచ్చని ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా త్వరలో వివరాలు తెలియనున్నాయి. ఓంరౌత్, భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2023, జనవరి 12న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.