శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 డిశెంబరు 2020 (12:23 IST)

కోడలితో మామ రాసలీలలు.. చంపేసిన భార్య.. పెద్దకోడలు.. ఎక్కడ?

కోడలితో మామ రాసలీలలు కొనసాగించాడు. అంతే.. భార్య పెద్దకోడలి చేతిలో హత్యకు గురయ్యాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ భాదోయి జిల్లాలోని కోయిరానా పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 55 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తికి భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. ఈ నలుగురు కుమారులు ముంబైకి వలస వెళ్లారు. ఇద్దరు కుమారులకు వివాహం కాగా, వారి భార్యలు అత్తమామల వద్దే ఉంటున్నారు. 
 
ఈ క్రమంలో చిన్న కోడలితో మామ అక్రమ సంబంధం కొనసాగించాడు. ఈ వ్యవహారం అత్తకు, పెద్ద కోడలికి నచ్చలేదు. దీంతో చిన్న కోడలిని కొద్ది రోజుల క్రితం పుట్టింటికి పంపారు. కోడలిని ఆమె ఇంటికి పంపడంతో కోపంతో రగిలిపోయిన మామ.. పెద్ద కోడలి మీద దాడి చేశాడు.
 
నాలుగు రోజుల క్రితం చిన్న కోడలిని మామ ఇంటికి తీసుకువచ్చాడు. చేసేదేమీ లేక శనివారం రాత్రి మామపై అత్త, పెద్ద కోడలు కలిసి కత్తితో గొంతు కోసి చంపేశారు. అప్రమత్తమైన చిన్న కోడలు అక్కడ్నుంచి తప్పించుకుని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటానస్థలికి చేరుకున్న పోలీసులు.. అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.