శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 మే 2022 (14:42 IST)

ముహూర్త టైమ్‌కు ఊడిన విగ్గు.. బట్టతల చూసి వధువు షాక్... పెళ్లి రద్దు

marriage
మరికొన్ని నిమిషాల్లో పెళ్లి తంతు ముగియాల్సివుంది. దీంతో పెళ్లి కుమారుడు తెగ సంబరపడిపోతున్నాడు. అయితే, పెళ్ళి పనుల్లో ఒకటి రెండు రోజులు నిద్రహారాలు లేకుండా ఉండటంతో వరుడు బాగా అలసిపోయి స్పృ తప్పి కిందపడిపోయాడు. ఆ తర్వాత వరుడు ముఖంపై నీళ్ళు చల్లి తలపాగా తీశారు. అంతే ఒక్కసారిగా విగ్గు ఊడిపోయి నున్నటి బట్టతల కనిపించింది. దీంతో బిత్తరపోయిన వధువు, ఆమె కుటుంబ సభ్యులు పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావోలో జరిగింది. 
 
మరికొద్ది సేపట్లో పెళ్లి అయిపోవాల్సివుంది. అయితే, జయమాల వేడుక అనంతరం పెళ్లి కుమారుడు బాగా అలసిపోయి స్పృహ తప్పిపడిపోయాడు. దీంతో అతడిని లేపేందుకు పెళ్లికూతురు సోదరుడు ముఖంపై నీళ్లు చల్లి తలపాగా తీయబోయాడు. ఆ సమయంలో వరుడు పెట్టుకున్న విగ్గు ఊడిపోయింది. దీంతో పెళ్లి కుమార్తె, బంధువులంతా షాకయ్యారు. 
 
పెళ్లి కుమారుడికి బట్టతల ఉందని ముందుకు ఎందుకు చెప్పలేదని, ఇంత మోసం చేస్తారా? అంటూ వధువు తరపువారు నిలదీశారు. పైగా, బట్టతల ఉన్న వ్యక్తిని తాను పెళ్లి చేసుకోనని వధువు భీష్మించికూర్చొంది. దీంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. 
 
ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు పెళ్ళి మండపం వద్దకు చేరుకున్నారు. ఇరు కుటుంబాలను శాంతపరిచి గొడవను మాత్రం ఆపగలిగారు గానీ, పెళ్లికి వధువును ఒప్పించలేక పోయారు. దీంతో వరుడు తీవ్ర నిరాశకు గురయ్యాడు.