ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (08:59 IST)

నేడు రెండో దశ ఎన్నికల పోలింగ్ : యూపీలో 55 సీట్లకు పోలింగ్

ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రెండో దశ పోలింగ్ జరుగుతోంది ఇందులోభాగంగా, అత్యంత కీలకంగా భావిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 55 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ విడతలలో అధికార బీజేపీకి ఏమాత్రం సానుకూలంగా లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో కమలనాథుల్లో ఆందోళన నెలకొంది. పైగా, ఈ స్థానాల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థులు ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థుల నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటున్నారు. 
 
ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ముఖ్య నేతల్లో గత 1989 నుంచి షాజన్‌పూర్ నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్న బీజేపీ సీనియర్ నేత సురేష్ ఖన్నా తొమ్మిదో సారి కూడా విజయకేతనం ఎగురవేయాలని భావిస్తున్నారు. 
 
అలాగే, రాంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ ఎమ్మెల్యేగా పని చేసి ప్రస్తుతం రాంపూర్ లోక్‌సభ సభ్యుడుగా ఉన్న అజంఖాన్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాంపూర్, సంభాల్, అమ్రెహా, ఛమ్రువా, నగినా వంటి స్థానాల్లో ముస్లిం ఓటర్లను అత్యధిక సంఖ్యలో ఉన్నారు. 
 
అయితే, గత 2017లో జరిగిన ఎన్నికల్లో ఈ 55 సీట్లలో బీజేపీ 38, ఎస్పీ 15 స్థానాల్లో గెలుపొందాయి. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఇక్కడ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. కానీ, ఈ దఫా పరిస్థితి తారుమారైంది.