బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2020 (13:47 IST)

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్.. పారిపోయిన కరోనా రోగి దొరికాడు..

కరోనా మహమ్మారిని కూకటి వేళ్లతో పెకలించి వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంగం సిద్ధం చేస్తున్నాయి. అందులో భాగంగా లాక్ డౌన్‌ను విధించింది. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో అన్నీ రంగాలు స్వచ్చందంగా మూతపడ్డాయి. ఈ మేరకు ప్రజలను కరోనాపై అవగాహన కల్పించేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
 
ఇదిలా ఉంటే కరోనా వ్యాధికి ఎలాగైనా చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. జేరైస్ కాడిలా రెండు వాక్సిన్‌లపై ప్రయోగాలు చేస్తుంటే.. సీరం ఇన్సి ట్యుట్, భారత్ బయోటెక్, మైన్ వ్యాక్స్ లాంటి ఆరు సంస్థలు కరొనపై విరుగుడు కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి త్వరలోనే కరోనాకు చెక్ పెట్టవచ్చు.
 
ఇదిలా ఉంటే, ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రి నుంచి పారిపోయిన కరోనా రోగిని హర్యానాలో పోలీసులు అరెస్టు చేశారు. కరోనా పాజిటివ్ అని తేలిన ఓ రోగి ఢిల్లీ ఆసుపత్రి నుంచి పారిపోయాడు. పారిపోయిన రోగి కోసం ఢిల్లీ పోలీసులు గాలింపు చేపట్టగా శనివారం హర్యానా రాష్ట్రంలోని రాయ్ గ్రామం వద్ద కనిపించాడు,. దీంతో ఢిల్లీ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి, అతన్ని మళ్లీ ఆసుపత్రిలో చేర్చారు. 
 
ఢిల్లీ నుంచి పారిపోయిన కరోనా రోగి మార్గమధ్యంలో ఎవరెవరినీ కలిశాడు అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కరోనా రోగిని కలిసి వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొత్తంమీద కరోనా రోగి పారిపోయిన ఘటన ఢిల్లీలో కలకలం రేపింది.