శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2020 (11:50 IST)

స్వచ్ఛ నగరం ఇలా కరోనా హాట్ స్పాట్‌గా మారింది.. 842 కరోనా కేసులతో..?

ఇండోర్ కరోనా హాట్ స్పాట్‌గా మారింది. స్వచ్ఛ నగరంగా పేరొందిన ఇండోర్ ఇలా కరోనా కేసులకు నిలయంగా మారిపోయింది. కేవలం మూడు రోజుల్లోనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలోనే కరోనా కేసుల సంఖ్య 430 చేరుకోవడం కలకలం రేపింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం 842 కరోనా కేసులతో దేశంలోనే అత్యధికంగా కరోనా ప్రభావిత రాష్ట్రాల జాబితాలోకి చేరింది. 
 
ఇతర దేశాల నుంచి విమానాల్లో వచ్చిన ప్రయాణికుల వల్ల ఇండోర్ నగరంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిందని ఇండోర్ జిల్లా కలెక్టరు మనీష్ సింగ్ చెప్పారు. కరోనా రోగులను గుర్తించడానికి కమల్ నాథ్ ర్కారు ఏమీ చేయకపోవడం వల్ల కరోనా కేసుల సంఖ్య పెరిగిందని ప్రస్థుత సీఎం శివరాజ్ సింగ్ ఆరోపించారు. కాగా కరోనా నిరోధానికి కాంగ్రెస్ సర్కారు ఏమీ చేయకపోయినా, ప్రస్థుత శివరాజ్ సింగ్ సర్కారు దీని నివారణకు ఏం చేస్తుందని ప్రజారోగ్య నిపుణులు అమూల్యనిధి ప్రశ్నించారు.
 
దేశంలో కరోనా మహామ్మారి తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. రోజురోజుకు దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నయి. శుక్రవారం ఒక్క రోజే దేశంలో 991కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో దేశంలో కరోన భాధితుల సంఖ్య 14,378కి చేరుకుంది. దేశంలో ఇప్పటి వరకు ఈ వైరస్‌ భారీన పడి 480 మంది ప్రాణాలు విడిచారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.