శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (09:24 IST)

ఇండోర్‌లో వైద్యుడు మృతి.. కేన్సర్ రోగులకు కూడా సోకిన వైరస్

కరోనా వైరస్ బారినపడిన ఓ వైద్యుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో జరిగింది. కరోనా రోగులకు వైద్యం చేస్తూ వచ్చిన ఈ వైద్యుడు.. వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయాడు. అలాగే, కరోనా విలయతాండవం చేస్తున్న ఇటలీలో సుమారు వందమందికి పైగా వైద్యులు చనిపోయారని ఆ దేశ ఆరోగ్య సంస్థల సంఘం తెలిపింది. 
 
అలాగే, దేశవ్యాప్తంగా వైద్య సేవలందిస్తున్న ఆరోగ్య సిబ్బందిలో కనీసం 10 శాతం మందికి కరోనా సోకి ఉంటుందని అంచనా వేసింది. ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా ఈ మహమ్మారిని ఎదుర్కోమనడం దారుణమని సంఘం అధ్యక్షుడు ఫిలిప్పో వ్యాఖ్యానించారు.
 
మరోవైపు, ఈ వైరస్ కేన్సర్ రోగులను కూడా వదిలిపెట్టడం లేదు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ముగ్గురు కేన్స‌ర్ రోగుల‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్దార‌ణ అయింది. ముగ్గురికి క‌రోనా అనుమానిత ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో వైద్యులు వారికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. క‌రోనా పాజిటి‌వ్గా తేలింది.
 
దీంతో ఈ ముగ్గురు వ్యక్తులను ఢిల్లీ స్టేట్ కేన్స‌ర్ ఇనిస్టిట్యూట్‌కు త‌రలించి.. ప్ర‌త్యేక ఐసోలేష‌న్ వార్డులో చికిత్స కొన‌సాగిస్తున్నామ‌ని ఆస్ప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. కాగా, ఢిల్లీ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే హాట్‌స్పాట్ల‌ను గుర్తించి రాక‌పోక‌ల‌పై పూర్తిగా నిషేధాజ్ఞ‌లు విధించిండి. ప్ర‌జ‌ల ఇంటి వ‌ద్ద‌కే నిత్యావ‌స‌ర వ‌స్తువులు పంపేలా ఏర్పాట్లు చేసింది.