శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 నవంబరు 2022 (10:18 IST)

యూపీలో దారుణం: వాహనాలపై రాళ్ల రువ్వడంతో మహిళలపై లాఠీ ఛార్జ్

Police
Police
యూపీలో దారుణం చోటుచేసుకుంది. పోలీసులు ఒక మహిళా సమూహంపై లాఠీ ఝుళిపించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో అంబేద్కర్‌ నగర్‌ జిల్లా జలాల్‌పూర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మహిళలు పోలీసుల వాహనాలపై రాళ్ల రువ్వడంతో వారిని చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా ఇలా చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఇటీవల ఆ ప్రాంతంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై మహిళలు నిరసన వ్యక్తం చేశారు.
 
దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీలతో దారుణంగా కొట్టి హింసించారు. ఈ నిరసనలు కారణంగా ఆ విగ్రహం ఉన్న స్థలంపై వివాదం నెలకొందని పోలీసులు తెలిపారు. మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై పలు విమర్శలు తలెత్తాయి.