సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 మార్చి 2022 (22:25 IST)

కొత్త సినిమా రిలీజా? అయితే, వంద టిక్కెట్లు ఇవ్వండి.. మేయర్ లేఖ

విజయవాడ మేయర్ వివాదంలో చిక్కుకున్నారు. కొత్త సినిమా విడుదలైతే తమకు వంద సినిమా టిక్కెట్లను కేటాయించాలంటూ ఆమె థియేటర్ యజమానులకు లేఖ రాయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని థియేటర్ యజమానులకు రాసిన లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది.
 
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి నెల గురు, శుక్రవారాల్లో అనేక కొత్త చిత్రాలు విడుదలవుతుంటాయి. వీటిలో చిన్న, పెద్ద చిత్రాలు ఉంటాయి. అయితే, ప్రతి నెల విడుదలయ్యే కొత్త చిత్రాలకు టిక్కెట్లు కావాలంటూ విజ్ఞప్తులు వస్తున్నాయని, అందువల్ల తమకు ప్రతి షోకు వంద టిక్కెట్లు చొప్పున కేటాయించాలని, ఈ టిక్కెట్లకు డబ్బులు చెల్లిస్తామని విజయవాడ మేయర్ ఆర్.భాగ్యలక్ష్మి పేరుతో థియేటర్ యజమానులకు ఓ లేఖ వెళ్లింది.