ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 మార్చి 2022 (12:31 IST)

వైకాపా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి మావోల వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైకాపా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి మావోయిస్టులు బెదిరింపు లేఖ పంపారు. బాక్సైట్ అక్రమ తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారని,  ఈ చర్యలను తక్షణం ఆపాలంటూ మావోలు రాసిన లేఖలో హెచ్చరించారు. 
 
ముఖ్యంగా, లేట్ రైట్ మైనింగ్ ముసుగుల బాక్సైట్ అక్రమ తవ్వకాలను ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. జీకే వీధి మండలం చాపరాతిపాలెంలో జరుగుతున్న మైనింగ్‌ను తక్షణం నిలుపుదల చేయాలని, అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మన్యం ప్రాంతాన్ని వీడి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. 
 
తమ హెచ్చరికలను పట్టించుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని మావోలు హెచ్చరించారు. గతంలో సివేరి సోమ, కిడారి సర్వేశ్వర రావుల తరహాలోనే ప్రజా కోర్టులో ప్రజలు శిక్షిస్తారని పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ్ పేరుతో ఈ లేఖను విడుదల చేశారు.