శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 5 మార్చి 2022 (15:48 IST)

ఆ పన్ను పెంపుతో వస్త్ర రంగం నాశనం: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మకు నారా లోకేష్ లేఖ

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాసారు. హస్త కళలు, చేనేత వృత్తులపై జీఎస్టీ 5 నుంచి 12 శాతానికి పెంచడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేసారు.

 
ఈ పన్ను వల్ల చేనేత రంగం నాశనమవుతుందనీ, అసలే కోవిడ్ కష్టాల్లో కొట్టుకులాడుతున్న ఈ రంగంపై జీఎస్టీ పన్ను పెంపుతో మరింత భారం మోపవద్దని అభ్యర్థించారు. పెంచిన పన్నును తిరిగి 5 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేసారు.