సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 13 మే 2018 (18:01 IST)

హవాలా రాణి అరెస్ట్.. అందాన్ని ఎరగా వేసింది.. ఆ ఫోన్ కాల్ వైరల్

సోషల్ మీడియాలో ఓ హవాలా రాణి మాట్లాడిన ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. హవాలా రాణిగా ఎదిగేందుకు తన అందాన్ని అధికారులకు ఎరగా వేసిన ఓ మహిళ కథ వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే బెంగళూరుకు చెందిన ప్రియ,

సోషల్ మీడియాలో ఓ హవాలా రాణి మాట్లాడిన ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. హవాలా రాణిగా ఎదిగేందుకు తన అందాన్ని అధికారులకు ఎరగా వేసిన ఓ మహిళ కథ వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే బెంగళూరుకు చెందిన ప్రియ, తక్కువ ధరకు లగ్జరీ కార్లను, బంగారాన్ని విక్రయిస్తుంటుంది. అంతేగాకుండా విదేశాల నుంచి డబ్బు తెప్పించడం.. పంపడం వంటి పనులు చేసేది. 
 
అయితే తాజాగా ఈమె మాట్లాడిన ఆడియో  క్లిప్ వైరల్ కావడంతో ప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె చేస్తున్న హవాలా దందాపై దృష్టి పెట్టారు. పూన్ గుండ్రాన్ అనే వ్యక్తి స్పెషల్ బ్రాంచ్- క్రిమినల్ విభాగంలో పనిచేస్తూ.. తిరుకొయిలూరులో పనిచేస్తున్నాడు. అతడు ప్రియతో మాట్లాడాడు. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుంటే హత్య చేయిస్తానని బెదిరిస్తూ మాట్లాడాడు.
 
ఈ రికార్డెడ్ కాల్ విల్లుపురం ఏరియాలో వైరల్ అయ్యింది. ఈ కేసుపై పోలీసులు విచారిస్తున్నామని.. పూన్ గుండ్రాన్ అనే వ్యక్తి మధ్యవర్తిగా ఖరీదైన వాహనాల కోసం ప్రియకు డబ్బు ఇచ్చినట్లు సమాచారం. ప్రియ, ఈరోడ్ ప్రాంతానికి చెందిన యువతి అని, ఆపై బెంగళూరులో స్థిరపడిందని పోలీసులు చెప్తున్నారు.