శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2020 (11:21 IST)

లాక్‌డౌన్ వేళ రెచ్చిపోయిన కామాంధుడు... మహిళపై అత్యాచారం

లాక్‌డౌన్ వేళ ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. తన ఇంట్లో ఒంటరిగా ఉన్న దృష్టిలోపం ఉన్న ఓ మహిళపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ దారుణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
భోపాల్ నగరంలోని షహపురా ప్రాంతానికి చెందిన 53 ఏళ్ల మహిళ బ్యాంకులో పని చేస్తోంది. ఈ మహిళ భర్త, కుటుంబ సభ్యులు తమ కుటుంబ పనుల నిమిత్తం రాజస్థాన్ వెళ్లి అక్కడ లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయారు. ఈ కారణంగా ఈ మహిళ మాత్రమే ఒంటరిగా ఇంట్లో నివసిస్తూ వచ్చింది. 
 
దీన్ని గమనించిన గుర్తుతెలియని కామాంధుడు... ఆ మహిళ నిద్రపోతుండగా ఇంటికి వచ్చి అత్యాచారం చేసి పారిపోయాడు. బాధిత మహిళకు దృష్టిలోపం ఉందని, మహిళ ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.