బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 జనవరి 2022 (13:40 IST)

ఫిట్ ఇండియా: జిమ్‌లో ప్రధాని వర్కౌట్స్ (వీడియో వైరల్)

PM Modi
ఫిట్ ఇండియా అంటూ సందేశం ఇస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. 71 ఏళ్ల వయస్సులో ప్రధాని జిమ్‌లో వర్కౌట్స్ చేయడం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ప్రధాని మోదీ ఆదివారం (జనవరి 2,2022) శంకుస్థాపన చేసిన సందర్భంగా.. "ఫిట్ ఇండియా" అనే సందేశాన్నిస్తూ కసరత్తులు చేశారు.  
 
మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ శంకుస్థాపనకు వెళ్లిన మోదీ అక్కడి కాంప్లెక్స్‌లో ఉన్న జిమ్‌ను సందర్శించి.. కాసేపు జిమ్‌లో బాడీవెయిట్ లాట్‌పుల్ మెషిన్‌తో ఎక్సర్‌సైజ్ ఎక్సర్‌సైజ్ చేశారు. ప్రధాని 15 సార్లు ఆ మెషిన్‌ను కిందికి పైకి చేస్తూ ఎక్సర్‌సైజ్ చేశారు. కాగా.. ప్రధాని మోడీ ఫిట్ నెస్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారనే విషయం తెలిసిందే. వాకింగ్ ఆయన దినచర్యలో తప్పనిసరి.