గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 4 జనవరి 2022 (13:24 IST)

మాజీ మంత్రి అఖిల‌ప్రియ బిడ్డ‌కు చంద్ర‌బాబు ఆశీర్వాదాలు

ఇటీవ‌ల మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన మాజీ మంత్రి అఖిల ప్రియ‌కు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు అభినంద‌న‌లు తెలిపారు. త‌న‌ను కలిసిన భూమ అఖిల ప్రియ, భార్గవ్ రామ్ దంపతుల‌ను ఆయ‌న సాద‌రంగా ఆహ్వానించారు. 
 
ఇటీవల భూమా అఖిలప్రియ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాదులో చంద్రబాబునాయుడు నివాసానికి వెళ్లి భూమా అఖిల ప్రియ దంప‌తులు, ఆమె సోద‌రుడు భూమా విఖ్యాత్ రెడ్డితోపాటు వెళ్ళి క‌లిశారు. త‌న బిడ్డ‌ను అఖిల‌ప్రియ పార్టీ అధినేత చంద్ర‌బాబుకు చూపించారు. బిడ్డ‌ను ఆశీర్వ‌దించిన చంద్ర‌బాబు, భూమా అఖిల ప్రియ దంపతులకు అభినందనలు తెలిపారు.