ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 జులై 2022 (23:05 IST)

దేశంలోనే అత్యధిక వయస్సున్న Raja the tiger కన్నుమూత

Tiger
Tiger
పశ్చిమ బెంగాల్‌లో దేశంలోనే అత్యధిక వయస్సున్న పులి కన్నుమూసింది. సోమవారం (జులై 11న) తెల్లవారుజామున 3 గంటలకు మృతిచెందినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. 
 
చనిపోయిన పులి వయస్సు 25 సంవత్సరాల10 నెలలు ఉంటుందని చెప్పారు. ఈ పులి భారత్ లోనే ఎక్కువ కాలం జీవించి ఉన్న పులులలో ఒకటిగా నిలిచిందని తెలిపారు. 
 
2008 ఆగష్టులో నార్త్‌ బెంగాల్‌ సుందర్‌బన్‌ అడవుల్లో  ఓరోజు మొసలితో పోరాడి తీవ్రంగా గాయపడ్డ రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ను..  సౌత్‌ ఖైర్‌బరి టైగర్‌ రెస్క్యూ సెంటర్‌కు తీసుకొచ్చారు.  
 
నిర్వాహకులు శ్రమించి దానిని సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ఆ తర్వాత "రాజా" దాదాపు పదిహేనేళ్లు బతికింది. రాజా మృతిపై నిర్వాహకులతో పాటు పలువురు సోషల్‌ మీడియాలో "వీ మిస్‌ యూ రాజా" అంటూ నివాళులు అర్పిస్తున్నారు. దానిని చూసేందుకు సందర్శకులు చాలామంది వచ్చేవారని అధికారులు తెలిపారు.