గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 28 మే 2017 (15:25 IST)

ప్రేమించిన యువతితో వాట్సాప్‌లో చాటింగ్ చేస్తూనే ప్రియుడి సూసైడ్

ఒడిషాలో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. తాను ప్రేమించిన యువతి మరో యువకుడితో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని ప్రియుడు.. ప్రియురాలితో చాట్ చేస్తూనే సూసైడ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకట

ఒడిషాలో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. తాను ప్రేమించిన యువతి మరో యువకుడితో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని ప్రియుడు.. ప్రియురాలితో చాట్ చేస్తూనే సూసైడ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ఒడిషా రాష్ట్రంలోని పూరీకి చెందిన సైకత్ రావు అదే ప్రాంతానికి ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఇంకేముంది గంటల కొద్దీ ఫోన్ సంభాషణలు, వాట్సాప్‌లో వీడియో చాటింగ్‌ చేసుకునేవారు. కొన్నాళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం ఆమె కోల్‌కత్తా వెళ్లింది. అయినప్పటికీ ఫోన్‌లో ఇద్దరూ ఫోనులో మాట్లాడుకుంటూ వచ్చారు. విద్యాభ్యాసం పూర్తిచేసి మంచి ఉద్యోగంలో చేరిన తర్వాత పెళ్లి చేసుకోవాలని భావించారు. 
 
దీంతో తన జీవిత భాగస్వామి ఆ యువతే అని స్పష్టమైన నిర్ణయానికి వచ్చిన సైకత్ రావు... ఏ పని చేయాలన్నా తన ప్రియురాలికి ఫోన్‌లో చెప్పిగానీ.. పని మొదలుపెట్టేవాడు కాదు. ఇలా సాఫీగా సాగిపోతున్న వీరి ప్రేమకథలో కొద్దిరోజులుగా చికాకులు మొదలయ్యాయి. తన ప్రియురాలు మరో యువకుడితో సన్నిహితంగా ఉందని సైకత రావు అనుమానించాడు. దీంతో వారిమధ్య గొడవలు ఎక్కువయ్యాయి. ఈనేపథ్యంలో శనివారం సాయంత్రం సైకత రావు తన లవర్‌కు వాట్సాప్‌లో వీడియో చాట్ చేస్తున్నాడు. వీడియో చాటింగ్‌లోనే ఇద్దరూ తిట్టుకున్నట్టు సమాచారం. 
 
తను వేరే యువకుడితో సన్నిహితంగా ఉంటోందన్న అనుమానాన్ని సైకత రావు వ్యక్తపరిచాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవైంది. తాను చచ్చిపోతున్నానని, తన చావును కళ్లారా చూడాలని లవర్‌తో చెప్పి చివరికి ఆమె వీడియో చాటింగ్‌లో ఉండగానే ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరేసుకుని సైకత రావు ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
సైకత రావు చావుబతుకుల్లో ఉన్నాడని, తనను కాపాడాలని సదరు యువతి అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారమందించింది. ఈ విషయాన్ని తెలుసుకుని హుటాహుటిన ఇంటికొచ్చిన కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సైకత రావు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.