ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2022 (19:22 IST)

బీఎఫ్ 7 సబ్ వేరియంట్.. ప్రాథమిక జాగ్రత్తలు తప్పనిసరి

Omicron
గుజరాత్‌లోని వడోదర, అహ్మదాబాద్ బీఎఫ్ 7 సబ్ వేరియంట్ కేసులను గుర్తించడం జరిగింది. వడోదరలోని సభాన్ పుర ప్రాంతంలో నివాసం వుంటున్న ఒక ఎన్నారై మహిళకు బీఎఫ్7 వేరియంట్ సోకినట్లు తేలింది. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నా.. ఆ మహిళలో బీఎఫ్.7 వేరియంట్‌ సంక్రమించింది. 
 
ఈ వేరియంట్ చైనాతో ఇతర దేశాల్లో విలయ తాండవం చేస్తుండటంతో భారత్‌లోనూ భయాందోళన మొదలైంది. ఈ వేరియంట్  లక్షణాల సంగతికి వస్తే.. జలుబు, దగ్గు, జ్వరం, శరీర నొప్పులు మొదలైనవి. 
 
బహిరంగ ప్రదేశాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కోవిడ్-19 సమయంలో చేసిన అనేక నియమాలను తొలగించడంతో ప్రజలు అజాగ్రత్తగా వుంటున్నారు. అయితే మళ్లీ కనీస ప్రాథమిక జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.