ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (12:11 IST)

అత్తాకోడళ్లపై అత్యాచారయత్నం.. టాయ్‌లెట్ కోసం వెళ్తే.. ముగ్గురు యువకులు?

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా తమిళనాడు, అరియలూరు జిల్లాలో టాయ్‌లెట్ కంటూ వెళ్లిన ఓ మహిళపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి ఒడిగట్టారు. అరియలూరు జిల్లా, రాయల్ సిటీకి చెందిన ఇందిరాగాంధీకి రంజిత అనే కోడలు వుంది. వీరిద్దరూ ఆస్పత్రికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా.. ఇందిరాగాంధీ టాయ్‌లెట్ కోసం పక్కకు వెళ్లారు. 
 
ఆ సమయంలో రంజిత బ్రిడ్జికి పక్కన అత్త కోసం వేచి వుండగా, ఇందిరాగాంధీపై ముగ్గురు యువకులు అత్యచార యత్నానికి పాల్పడ్డారు. ఆమె అరవడంతో ఆమెను కాపాడేందుకు వచ్చిన రంజితపై కూడా ముగ్గురు యువకులు అత్యాచారయత్నం చేశారు. 
 
వీరి అరుపులకు ఆ మార్గంలో వెళ్లిన వ్యక్తులు అత్తాకోడళ్లను కాపాడారు. అంతే పారిపోయిన ముగ్గురు వ్యక్తుల్లో ఒక యువకుడిని మాత్రమే పట్టుకోగలిగారు స్థానికులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.