మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: సోమవారం, 29 ఏప్రియల్ 2019 (20:28 IST)

ఆ పని చేస్కుంటున్నా... అందుకే నావల్ల కావడంలేదంటున్నాడు... ఎలా?

పెళ్లై ఏడాది దాటింది. ఐతే ఈ ఏడాది కాలంగా నేను దాంపత్య సుఖాన్ని పూర్తిస్థాయిలో అనుభవించలేదు. ఆయనకు హ.ప్ర అలవాటు కాలేజీ డేస్ నుంచే ఉన్నదట. అందుకని పెళ్లైన తర్వాత కూడా రోజూ చేసుకుంటూ ఉండేవాడు. దాంతో బెడ్రూంలోకి వచ్చేసరికి చప్పగా పడుకునేవారు. కొన్నాళ్లు ఓపిక పట్టాను, కానీ ఇటీవల నాలో కోర్కెలు విపరీతం కావడంతో హ.ప్ర మానుకోవాలని ఒత్తిడి చేశా. 
 
నా ఒత్తిడితో మానుకున్నారు కానీ శృంగారం చేసేటపుడు క్లైమాక్స్ వచ్చేసరికి స్ఖలించడంలేదు. నాకు తీవ్రమైన అసంతృప్తిగా ఉంది. ఎందుకు అలా అని అడిగితే... హ.ప్ర ఎఫెక్ట్ అయి ఉంటుందంటున్నాడు. నేను చెప్పినప్పటికీ చాటుగా నాకు తెలియకుండా చేస్కుంటున్నాడట. ఇక నా దాంపత్య జీవితం ఇంతేనా... ఆయనకు ఆ అలవాటు పోదా?
 
హ.ప్ర చేసినంత మాత్రాన స్ఖలించలేకపోవడం అంటూ ఉండదు. అంతా మనసు పైనే ఆధారపడి ఉంటుంది. అలాగే శృంగారపరంగా ఉద్రిక్త చెందకపోవడం కూడా కారణం కావచ్చు. కనుక ముందుగా ఫోర్ ప్లేలో పాల్గొన్న తర్వాత ప్రయత్నించాలి. అలాగే భంగిమల్లోనూ మార్పు చేసి చూడాలి. కొత్తకొత్త ప్రయోగాలు చేసి చూడాలి. అలా చేసినప్పుడు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అప్పటికీ ఆయనలో అలాంటి సమస్య కనబడుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.