ఆ లక్షణాలు ఉన్నవారిని నమ్మొద్దన్నా... అందుకే నేను సైలెంట్: జె.సి.
నాకు రాజకీయాలు బాగా తెలుసు. రాజకీయాల గురించి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని రకాల మనుషులను నేను చూశాను. కానీ పార్టీలు మారితే 9 లక్షణాలు ఉన్న రాజకీయ నేతలు చాలామంది ఉన్నారు. స్వార్థపరులు మన చుట్టూనే ఉన్నారు. అందుకే నేను బాధపడుతున్నా. ఈసారి ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు.
నిస్వార్థమైన రాజకీయాలు చేయాలనుకునే నేను ఎన్నికల్లో పోటీ చేయలేదు. నా కుమారుడే పోటీలో ఉంటానన్నాడు. సరేనన్నా. పోటీ చేశాడు. నా కొడుకు ఎక్కడ కూడా డబ్బులు పంచలేదు. ఓటర్లను ప్రలోభపెట్టలేదు. కానీ కొంతమంది మాత్రం మమ్మల్ని ఓడించడానికి ఇష్టానుసారంగా డబ్బులు పంచేశారు. కానీ ఏం ఉపయోగం గెలుపు మాదే. చంద్రబాబు మళ్ళీ సిఎం అవుతాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది.
ఇదే విషయం నేను చెబుతున్నా. నాకు తెలుసు అనంతపురం జిల్లాను ఇంకా అభివృద్థి చేసుకోవాలి. ప్రజలు అభివృద్థిని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు జె.సి.దివాకర్ రెడ్డి. అన్ని ఎన్నికలను చూసి నాకు బాగా బుద్దొచ్చింది. అందుకే నేను సైలెంట్‌గా ఉండిపోయానంటున్నారు జె.సి.దివాకర్ రెడ్డి.