గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (09:00 IST)

యానాం ఎమ్మెల్యే రాజీనామా

యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఫార్మాట్ లో పంపించినట్లు తెలియజేశారు.

చాలా రోజుల నుంచి అధికారిక కార్యక్రమాలకు మల్లాడి దూరంగానే ఉన్నారు. యానాం ప్రాంతానికి సంబంధించిన సమస్యలపై ఇటీవల రాష్ట్రపతిని కలిసి వినతిపత్రాన్ని కూడా సమర్పించారు.
 
1996 నుంచి 2016 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో యానాం నియోజకవర్గం నుంచి ఓటమి ఎరుగని నాయకుడిగా విజయం సాధిస్తూ వచ్చారు మల్లాడి కృష్ణారావు.

నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ.. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా యానాం సమస్యల పరిష్కారం కోసం అటు కేంద్రంతోనూ... రాష్ట్రంలో నాయకులతోనూ సఖ్యతగా మెలగడం ద్వారా పనులు సాధించుకోవడంలో ఆయన అందెవేసిన చేయి.