శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 ఆగస్టు 2022 (21:54 IST)

వాఘా సరిహద్దుల్లో విజయసాయి రెడ్డి : స్వర్ణ దేవాలయం సందర్శన

vijayasai reddy
వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఇండో పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతమైన వాఘాను సందర్శించారు. తన పంజాబ్ పర్యటనలో భాగంగా ఆయన వాఘా - అట్టారీ సరిహద్దు ప్రాంతానికి వెళ్లి భారత జవాన్లతో కలిసి ఫోటోలు దిగారు. అలాగే, స్వర్ణదేవాలయాన్ని సందర్శించారు. ఆ పిమ్మట జలియన్ వాలాభాగ్‌లో అమరవీరులకు నివాళులు అర్పించారు. 
 
స్వర్ణదేవాలయాన్ని సందర్శించిన తర్వాత ఆయన మాట్లాడుతూ, గురుగ్రంథ్ సాహిబ్ భక్తి గీతాలు వింటుంటే మనస్సుకు ఎంతో ప్రశాంతంగా అనిపించిందన్నారు. అమృత్‌సర్‌లో దేశ విభజన మ్యూజియంను కూడా దర్శించిన సాయిరెడ్డి... దేశ విభజన నాటి గాథలు విని చనిపోయారు.
vijayasai reddy
 
నాడు స్వాతంత్ర్యోద్యమ ఘట్టంలో విషాద పరిణామాలకు వేదికైన జలియన్‌ వాలాభాగ్‌ను కూడా ఆయన సందర్శించి అమరవీరులకు నివాళులు అర్పించారు. అలాగే, ఇండోపాక్ బోర్డర్‌కు వెళ్లి అక్కడ నిత్యం జరిగే సైనిక దళాల కవాతును ఆయన వీక్షించారు. వందేమాతరం, హిందుస్థాన్ జిందాబాద్ అనే నినాదాలతో మార్మోగిపోతుందని ఆయన వెల్లడించారు. దేశ రక్షణలో ముందు వరుసలో నిలిచే బీఎస్ఎఫ్‌ పట్ల గర్విస్తున్నట్టు విజయసాయి రెడ్డి తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.