బుధవారం, 4 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 జులై 2024 (19:18 IST)

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

Malai Chicken
Malai Chicken
పిల్లలకు ఈజీగా ఇంట్లోనే హోటల్ స్టైల్ మలాయ్ చికెన్ ఎలా చేయాలో సింపుల్‌గా చూసేద్దాం. ముందుగా ఓ పాన్‌లో చికెన్ ముక్కలు, పెరుగు, క్రీమ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం పొడి, మిరియాల పొడి, ఉప్పు కలపాలి. బాగా కలపి, మసాలాలు చికెన్ ముక్కలకు పట్టేలా చూసుకోవాలి. 
 
మసాలా పూసిన చికెన్ ముక్కలను కనీసం 30 నిమిషాలు నానబెట్టాలి. ఆపై ఒక పాన్‌లో నూనె వేడి చేసి, నానబెట్టిన చికెన్ ముక్కలను బంగారు గోధుమ రంగులోకి వచ్చేంతవరకు వేపుకోవాలి. బాగా ఉడికిన తర్వాత సాస్‌తో పిల్లలకు సర్వ్ చేస్తే సరిపోతుంది. అంతే మలై చికెన్ ఇంట్లోనే రెడీ. వీటిని వేడిగా అన్నం లేదా రొట్టెలతో వడ్డించవచ్చు.
 
మలై చికెన్ అనేది పెరుగు, మసాలాలతో సిద్ధం అవుతుంది. ఇది మృదువైన, జ్యుసి చికెన్ ముక్కలతో,  క్రీమీ, రుచికరమైన గ్రేవీతో ఉంటుంది. పెరుగులో ముంచి ఉడికించడం వల్ల చికెన్ ముక్కలు చాలా మెత్తగా ఉంటాయి. పెరుగు, క్రీమ్ వాడటం వల్ల ఈ వంటకం ఈజీగా పూర్తి చేయవచ్చు.