శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 నవంబరు 2020 (13:02 IST)

జో బైడెన్ 'కరోనా టాస్క్‌ఫోర్స్‌'లో తెలుగు బిడ్డ!

అమెరికా కొత్త అధ్యక్షుడుగా డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించారు. ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించకలేదు. మరోవైపు, ప్రస్తుత అధినేత డోనాల్డ్ ట్రంప్ ఈ ఓటమిని అంగీకరించడం లేదు. పైగా, శ్వేతసౌథాన్ని వీడేందుకు ఆయన ససేమిరా అంటున్నారు. ఈ పరిణామాలు ఎలావున్నప్పటికీ.. ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త అధ్యక్షుడిగా అవతరించిన జో బైడెన్ మాత్రం కథన రంగంలోకి దిగారు. 
 
ముందుగా అమెరికాను వణికిస్తున్న కరోనా మహమ్మారిపైనే ఆయన దృష్టిసారించారు. ఇందుకోసం ఆయన ఓ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ముగ్గురు సభ్యులకు చోటు కల్పించారు. ఈ ముగ్గురిలో ఒకరు తన తెలంగాణ బిడ్డ కావడం గమనార్హం. ఇండో-అమెరికన్‌, అమెరికా మాజీ సర్జన్‌ జనరల్‌ డాక్టర్‌ వివేక్‌ మూర్తి (43) ఈ టాస్క్ ఫోర్స్ సభ్యుడిగా ఉన్నారు. 
 
వివేక్‌ మూర్తి జూలై 10, 1977లో ఇంగ్లండ్‌లో జన్మించారు. ఈయన పూర్వీకులు కర్ణాటకకు చెందినవారు. భారత్‌ నుంచి బ్రిటన్‌కు వలస వెళ్లారు. వివేక్‌కు మూడేళ్ళ వయసున్నప్పుడు ఆయన తండ్రి లక్ష్మీనారాయణ మూర్తి బ్రిటన్‌ నుంచి అమెరికాలోని ఫ్లోరిడాకు మకాం మార్చారు. 
 
వివేక్‌ ప్రతిష్టాత్మక హార్వర్డ్‌ వర్సిటీలో బ్యాచిలర్స్‌ డిగ్రీ, యేల్‌ యూనివర్సిటీల్లో ఎండీని అభ్యసించారు. 1995లో ‘విజన్స్‌ వరల్డ్‌వైడ్‌' పేరిట ఓ ఎన్జీవోను స్థాపించారు. దీనిద్వారా ఎయిడ్స్‌ పట్ల అమెరికా, భారత్‌లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. 2014-2017 మధ్యకాలంలో ఒబామాతో పాటు డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో 19వ అమెరికా సర్జన్‌ జనరల్‌గా విధులు నిర్వహించారు.