గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శనివారం, 18 నవంబరు 2017 (08:29 IST)

శనివారం మీ రాశి ఫలితాలు.. మీ నిజాయితీకి ప్రశంసలు అందుతాయి...

మేషం: వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. మీ సంతానం ఆరోగ్యం, విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. బంధుమిత్రులతో కలిసి సరదాగా గడుపుతారు. మిమ్ములను చిన్నచూపు చూసిన వారే మీ సా

మేషం: వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. మీ సంతానం ఆరోగ్యం, విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. బంధుమిత్రులతో కలిసి సరదాగా గడుపుతారు. మిమ్ములను చిన్నచూపు చూసిన వారే మీ సాన్నిత్యం కోరుకుంటారు. తీర్థయాత్రలకై చేయు యత్నాలలో సఫలీకృతులవుతారు.
 
వృషభం: ఆర్థిక విషయాల్లో శుభపరిణామాలు సంభవిస్తాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. ప్రముఖులను కలుసుకుంటారు. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. మిమ్ములను విమర్శించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు.
 
మిథునం: స్త్రీలకు పుట్టింటి మీద ధ్యాస మళ్ళుతుంది. తీర్థయాత్రలు, కొత్త ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ప్రముఖ కంపెనీల షేర్లు నష్టాల బాటలో నడుస్తాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. మీ మౌనం వారికి గుణపాఠం అవుతుంది.
 
కర్కాటకం : వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించవలసి వుంటుంది. మొండి బాకీలు వసూలు కాగలవు. సభలు, సన్మానాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. పెద్జలు, ప్రముఖులతో మితంగా సంభాషించండి. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల వల్ల మోసపోయే ఆస్కారం వుంది. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకోవలసి వుంటుంది.
 
సింహం: పత్రిక, వార్తా సంస్థల్లోని వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. వైద్య రంగాల వారికి ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తుల నిర్లక్ష్యం వల్ల అధికారుల నుంచి మాటపడాల్సి వస్తుంది. దైవ, పుణ్య, సేవా కార్యాల పట్ల మరింత ఆసక్తి పెంచుకుంటారు. ఏదైనా స్థిరాస్తి అమ్మకం వాయిదా పడటం మంచిది.
 
కన్య: సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలకు నరాలు, ఎముకలు, దంతాలకు సంబంధించి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహరాలకు దూరంగా ఉండటం మంచిది. మొహమ్మాటాలకు పోయి ధనం విపరీతంగా వ్యయం చేయాల్సి వస్తుంది. అనుబంధాల్లో మార్పు మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది.
 
 
తుల : మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మీ ఔదార్యాన్ని కొంతమంది దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఆత్మీయుల భరోసా మీకు సంతృప్తినిస్తుంది. కొత్త పరిచయస్తులతో అతి చనువు మంచిది కాదు. మీ సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయటం శ్రేయస్కరం.
 
వృశ్చికం: ఉద్యోగులకు విధి నిర్వహణలో చికాకులను ఎదుర్కొంటారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించినా గాని అనుకున్న పనులు పూర్తి కావు. సోదరులతో పరస్పర అవగాహన లోపం తలెత్తవచ్చు. పుణ్యక్షేత్ర సందర్శనలు, వనసమారాధనలు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. వృత్తుల వారికి సంఘంలో మంచి గుర్తింపు, తగిన ప్రతిఫలం లభిస్తాయి.
 
ధనస్సు: వ్యాపార రహస్యాలు గోప్యంగా ఉంచడం శ్రేయస్కరం. సాహస ప్రయత్నాలు విరమించండి. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. మీ అతిథి మర్యాదలు ఎదుటివారిని సంతృప్తిపరుస్తాయి. విద్యార్థుల అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు.
 
మకరం: బంధువుల రాక వల్ల గృహంలో సందడి కానవస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. ప్రైవేట్ సంస్థల్లోని వారు మార్పులకై చేయు ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. స్త్రీలకు నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి.
 
కుంభం: రేషన్ డీలర్లకు ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. మీ సంతానం కోసం బాగా శ్రమిస్తారు. ఆత్మీయుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
మీనం: బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు. మీ నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి. కొంత మొత్తమైనా పొదుపు చేయాలనే మీ సంకల్పం నెరవేరుతుంది. సంఘంలో మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లు అసాధ్యమనుకున్న టెండర్లు చేజిక్కించుకుంటారు.