Dharma Sangrah
✕

01-05-2020 శుక్రవారం దినఫలాలు - కామేశ్వరిదేవిని పూజిస్తే...

Written By రామన్
Updated: గురువారం, 30 ఏప్రియల్ 2020 (21:17 IST)
మేషం : ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు పెరుగుతాయి. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఊహించని విధంగా ధనలాభం పొందుతారు. బంధు మిత్రులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులక పురోభివృద్ధి కానవస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో మెళకువ చాలా అవసరం. 
 
వృషభం : ఆర్థిక స్థితిలో ఏమాత్రం పురోభివృద్ధి ఉండదు. పెద్దల ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదాపడతాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆందోళన పెరుగుతుంది. దంపతుల మధ్య నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు సామాన్యం. 
 
మిథునం : ఆదాయానికి మంచి ఖర్చులు అధికమవుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. 
 
కర్కాటకం : ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. నూతన ప్రవేశం సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిన్నతరహా పరిశ్రమల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో ఏకాగ్రత ముఖ్యం. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 
 
సింహం : వృత్తి వ్యాపారాలు నిరుత్సాహరుస్తాయి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. సన్నిహితులతో మాటపట్టింపులు తప్పవు. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువుల నుంచి ఒత్తిడి చికాకులను ఎదుర్కొంటారు. పనులు వాయిదాపడతాయి. 
 
కన్య : ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. 
 
తుల : స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఖర్చులు సామాన్యం. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఒక స్థిరాస్తిని అమర్చుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల సమాచారం అందుకుంటారు. దైవ, సేవా కార్యక్రమాల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. 
 
వృశ్చికం : ఆదాయ వ్యయాలాల్లో సమతుల్యత ఉంటుంది. పన్నులు, బీమా, బిల్లులు పరిష్కారం అవుతాయి. గృహంలో ఒక శుభకార్యానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. వృత్తి వ్యాపారాలలో బాగుగా రాణిస్తారు. మొండి బాకీలు తీరుస్తారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుట వల్ల మాట పడవలసివస్తుంది. 
 
ధనస్సు : ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. బ్యాంకు వ్యవహారాలలోని పనులు చురుకుగా సాగుతాయి. స్త్రీలకు దూర ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వాహనం నపుడునపుడు మెళకువ అసరం. 
 
మకరం : బంధువుల రాకతో ధనం అధికంగా వెచ్చిస్తారు. వ్యాపారస్తులకు అధికారుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. దూర ప్రయాణాలలో మెళకువ అవసరం. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేతి వృత్తుల వారికి ఆశాజనకం. 
 
కుంభం : ఆర్థికంగా బాగుగా అభివృద్ధి చెందుతారు. బ్యాంకు వ్యవహారాలు వాయిదాపడతాయి. రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బంధు మిత్రుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. దూర ప్రయాణాలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. 
 
మీనం : మీ కళత్రమొండి వైఖరి, కుటుంబీకుల పట్టుదల మనశ్శాంతిని దూరం చేస్తాయి. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఎల్.ఐ.సి, పోస్టల్, ఇళ్ల స్థలాల బ్రోకర్లకు, ఏజెంట్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మీ సంకల్ప బలానికి సన్నిహితుల సహాయం తోడవుతుంది. 

అన్నీ చూడండి

మార్కో రూబియో, సెర్గియో గోర్‌లకు జామ్ నగర్‌కు స్వాగతం పలికిన ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ

జంబూ సవారీలో అపశృతి, అమ్మవారి అంబారీని కిందపడేసిన ఏనుగు, వీడియో

ఆప్ఘనిస్థాన్ వ్యక్తి.. ఆయనకు నలుగురు భార్యలు.. 58 మంది పిల్లలు.. పోషించలేక ఇబ్బందులు.. (video)

పంజరంలో పెట్టిన పాలపిట్ట రోదనలో శుభం ఎలా కనిపిస్తుంది?: సజ్జనార్ ప్రశ్న

SIRకి వ్యతిరేకంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్...

అన్నీ చూడండి

శిశువు మెడలో పేగు వేసుకుని జన్మిస్తే...?

నల్లపిల్లి, కన్ను అదరడం, సాయంత్రం ఇల్లు చిమ్మడం మంచిదేనా?

21-10-2026 బుధవారం దిన ఫలాలు - బాకీలను చాకచక్యంగా వసూలు చేసుకోవాలి...

20-10-2026 మంగళవారం రాశి ఫలాలు - ఆర్థిక విషయాల్లో ఇతరుల మాటల్ని నమ్మొద్దు

19-10-2026 సోమవారం ఫలితాలు - ఆశించిన ఆశించిన పదవి దక్కకపోవచ్చు...

తర్వాతి కథనం
Show comments