మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 20 డిశెంబరు 2019 (14:23 IST)

20-12-2019 శుక్రవారం మీ రాశి ఫలితాలు (video)

ఇష్టకామేశ్వరి దేవిని పూజించడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది. 
 
మేషం: వ్యాపారాల్లో ఒక నష్టాన్ని మరో విధంగా పూడ్చుకుంటారు. ప్రముఖుల సిఫార్సులతో పనులు సానుకూలమవుతాయి. ఉద్యోగస్తుల సమర్థతకు మంచి గుర్తింపు, నగదు బహుమతి పొందుతారు. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రముఖుల పరిచయాలతో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. 
 
వృషభం: రాజకీయాల్లో వారికి మతిమరుపు పెరగడం వల్ల ఆందోళనకు గురవుతారు. ఇతరుల క్షేమం కోరి చేసిన మీ వాక్కు ఫలిస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిదని గమనించండి. మీ సంతానం కోసం ధనం విచ్చల విడిగా వ్యయం చేస్తారు. స్త్రీలపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి.
 
మిథునం: ఆస్తి పంపకాల విషయమై దాయాదులతో ఒప్పందానికి వస్తారు. రావలసిన ఆదాయంపై దృష్టి సారిస్తారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది. ప్రముఖులకు బహుమతులు అందజేస్తారు.
 
కర్కాటకం: వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు అమలు చేస్తారు. బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు అనుకున్న విధంగా సాగవు. సభలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ఊహించని చికాకులను ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో ఇబ్బందులు తప్పవు.
 
సింహం: కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఒత్తిడి అధికమవుతుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కళ, క్రీడ, సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. విదేశీ చదువులకు మార్గం సుగమమవుతుంది. మీ శ్రీమతి వైఖరి ఆగ్రహం కలిగిస్తుంది.
 
కన్య: వస్త్ర, బంగారు, వెండి రంగాల్లో వారికి పనివారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి అధికమవుతుంది. కొబ్బరి, పండ్లు, పూల, వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు.
 
తుల: బంధువుల రాకతో ఖర్చులు అధికం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి శ్రమ, పనిభారం అధికమవుతాయి. సంతానపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు మేలు చేకూరుస్తాయి. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప ఆటుపోట్లు, చికాకులు ఎదుర్కొంటారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
 
వృశ్చికం: స్త్రీలు పట్టువిడుపు ధోరణితో మెలగాలి. బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్త అవసరం. ఉపాధ్యాయులకు కార్యక్రమాల్లో ఒత్తిడి అధికమవుతుంది. ఉమ్మడి ఆర్థిక వ్యవహారాల్లో మాటపడాల్సి వస్తుంది. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. 
 
కుంభం: అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. పత్రికా రంగంలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. రాజకీయనాయకులు సభ సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు.
 
మీనం: ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. శ్రీవారు, శ్రీమతికి అవసరమైన వస్తువులు సేకరిస్తారు. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు సంబంధించిన లేఖలు అందుతాయి. దాన, ధర్మాలు చేసి మంచి గుర్తింపు, రాణింపు పొందుతారు.