బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : సోమవారం, 25 మార్చి 2019 (09:30 IST)

25-03-2019 - సోమవారం మీ రాశి ఫలితాలు - తొందరపడి వాగ్ధానాలు చేసి...

మేషం: కోర్టు, ట్రాన్స్‌పోర్ట్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ముఖ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రియతముల రాక సమాచారం మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకు ఒత్తిడి, చికాకులు అధికమైనా సంతృప్తి కానవస్తుంది. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు శుభదాయకం.
 
వృషభం: శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు. ఎప్పటివరకు వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభమవుతాయి. సినిమా, సాంస్కృతిక, కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు చిన్న అవకాశం లభించిన సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. రాజకీయ నాయకులకు మెళకువ అవసరం.
 
మిధునం: ఉపాధ్యాయులకు విద్యార్థుల వలన ఒత్తిడి, చికాకులు ఎదుర్కుంటారు. స్త్రీలు వస్తువులు కొనుగోలుకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. భాగస్వాముల మధ్య అవగాహన లోపం. తొందరపడి వాగ్ధానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. బ్యాంకు లావాదేవీలకు అనుకూలం. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయం వంతంగా పూర్తిచేస్తారు. 
 
కర్కాటకం: ఆర్థిక విషయాలలో ఒకడుగు ముందుకు వేస్తారు. వ్యవసాయ, తోటలు రంగాలలో వారికి అనుకున్నంత సంతృప్తికానరాదు. ఆపద సమయంలో స్నేహితులు అండగా నిలుస్తారు. చిట్స్, ఫైనాన్స్, చిట్‌ఫండ్ వ్యాపారస్తులకు ఓర్పు, నేర్పు చాలా అవసరం. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.
 
సింహం: ఉద్యోగస్తులకు అపరిచిత వ్యక్తులతో మెళకువ అవసరం. స్త్రీలకు నూతన పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన అమలులో పెడతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. దంపతుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. 
 
కన్య: ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. విద్యార్థులు ఇతరులు కారణంగా మాటపడవలసి వస్తుంది. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళకువ అవసరం. వృత్తి, ఉద్యోగాలలో శ్రమాధిక్యత, చికాకులు తప్పవు. గత స్మృతులు జ్ఞప్తికి రాగలవు. క్రయవిక్రయ రంగాలవారికి పురోభివృద్ధి. 
 
తుల: ఒక శుభకార్యం నిశ్చయం కావడంతో స్త్రీలలో ఉత్సాహం, హడావుడి చోటు చేసుకుంటాయి. ద్విచక్రవాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి. గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది. మీ సంతానం చేయు పనులు మీకెంతో చికాకులు కలిగిస్తాయి. బంధువులను కలుసుకుంటారు.
 
వృశ్చికం: ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్ రంగాలవారికి పనివారితో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలు విలువైన వస్త్రాలు, ఆభరణాలు అమర్చుకుంటారు. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటిన మిత్రుల సహాయ సహకారల వలన సమసిపోగలవు. 
 
ధనస్సు: ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి నిరుత్సాహనం, ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. సోదరీసోదరులతో అవగాహన లోపం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. మీ వ్యక్తిగత విషయాలు బయటకు తెలియకుండా గోప్యంగా ఉంచండి. సాహిత్య సదస్సులలోను, బృందకార్య క్రమాల్లోను పాల్గొంటారు. 
 
మకరం: ఆర్థిక లావాదేవీలు, కీలకమైన చర్చలు సానుకూలమవుతాయి. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత అవసరం. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారాలు సంతృప్తినిస్తాయి. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ఖర్చులు అధికం కావడంతో ఒకింత ఒడిదుడుకులకు లోనవుతారు. చేతివృత్తులు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. 
 
కుంభం: వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. మిత్రులను కలుసుకుంటారు. బంధువుల రాకతో గృహంలో ఖర్చులు అధికమవుతాయి. మీ మాటకు కుటుంబంలో ఆదరణ లభిస్తుంది. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. 
 
మీనం: శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసాన్ని కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. మీ పెద్దల వైఖరి ఎంతో చికాకు కలిగిస్తుంది. మిత్రులను కలుసుకుంటారు. కాంట్రాక్టర్లకు ఎప్పటి నుండో ఆగివున్న పనులు పునఃప్రారంభమవుతాయి. రాజకీయాలలో వారికి గుర్తింపుతో పాటు చికాకులు తప్పవు.