శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (08:53 IST)

25-09-2018 - మంగళవారం దినఫలాలు - ఉద్యోగయత్నంలో బిడియం, భేషజం

మేషం: దైవరాధన పట్ల ఆశక్తి పెరుగుతుంది. సోదరీసోదరుల మధ్య సఖ్యతాలోపం, కలహాలు చోటుచేసుకుంటాయి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త అవసరం. ఉద్యోగులు కార్మిక, విద్యుత్ లోపం వంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. వ్యాపార వర

మేషం: దైవరాధన పట్ల ఆశక్తి పెరుగుతుంది. సోదరీసోదరుల మధ్య సఖ్యతాలోపం, కలహాలు చోటుచేసుకుంటాయి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త అవసరం. ఉద్యోగులు కార్మిక, విద్యుత్ లోపం వంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి.
 
వృషభం: స్థిరచరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు వాయిదాపడుతాయి. బంధువుల రాకతో గృహంలో కొత్త ఉత్సాహం, సందడి చోటుచేసుకుంటాయి. వస్త్రాలు, విలువైన వస్తువుల కొనుగోళ్ళ నిమిత్తం ధనం విరివిగా వ్యయం చేస్తారు. దూరప్రయాణాలు చేస్తారు. స్త్రీల కళాత్మతకు, ప్రతిభకు మంచి గుర్తింపు పురస్కారాలు లభిస్తాయి.  
 
మిధునం: వస్త్ర, బంగారం, వెండి రంగాల్లో వారికి ఒత్తిడి అధికమవుతుంది. విద్యార్థుల మెుండివైఖరి ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకు అధికమవుతాయి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. ఏమాత్రం పొదుపు సాధ్యంకాదు. ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది.  
 
కర్కాటకం: ఆర్థిక విషయాల్లో అనుకున్నంత సంతృప్తికానరాదు. కుటుంబాభివృద్ధికై మీరు చేసే యత్నాలు ఫలిస్తాయి. వ్యవసాయ రంగాల్లో వారికి ఆందోళన తప్పదు. ఆహార వ్యవహారాల్లో మెళకువ అవసరం. విద్యార్థులు తమ లక్ష్యం సాధించడానికి అధిక కృషి చేయవలసి ఉంటుంది. ఒకలేఖ మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. 
 
సింహం: తలచిన పనులు వెంటనే పూర్తి చేయగలుగుతారు. గృహంలో శుభకార్య యత్నలా ఫలిస్తాయి. ముఖ్యులరాకతో మీలో నూతనోత్సాహం నెలకొంటుంది. వృత్తి వ్యాపారులకు శుభదాయకం. ఔషధ సేవనంతప్పకపోవచ్చు. రావలసిన ధనం సకాలంలో అందుకుంటారు. గత తప్పిదాలు పనురావృతం కాకుండా జాగ్రత్త వహించండి.   
 
కన్య: దైవదర్శనాలు అనుకూలిస్తాయి. కోర్టువ్యవహారాలు వాయిదా పడుతాయి. అతిగా సంభాషించడం వలన ఏర్పడే అనర్థాన్ని ఈ మాసం మీరు గుర్తిస్తారు. స్థిరచరాస్తుల క్రయవిక్రయాల్లో పునరాలోచన మంచిది. వృత్తి వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. విద్యార్థులకు ఇతర వ్యాపకాలు అధికమవుతాయి.      
 
తుల: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఔషధసేవనం తప్పకపోవచ్చు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ వహించండి. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ఖర్చులు చెల్లింపులలో ఏకాగ్రత వహించండి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి.  
 
వృశ్చికం: రాజకీయాల్లో వారికి ప్రతికూల వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. దంపతుల మధ్య నూతన విషయాలు చర్చకు వస్తాయి. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి.    
 
ధనస్సు: ఆర్థికలావాదేవీలు, వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ఆత్మీయులను వేడుకలు, విందులకు ఆహ్వానిస్తారు. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వృత్తులవారికి అవకాశాలు కలిసివస్తాయి. నిరుద్యోగులకు చక్కని అవకాశం లభిస్తుంది. సద్వినియోగం చేసుకోండి.  
 
మకరం: వస్త్రం, బంగారం వ్యాపారాలు ఊపందుకుంటాయి. దైవకార్యాల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి నిర్మాణ పనుల్లో ఏకాగ్రత అవసరం. విద్యార్థులకు దూరప్రదేశాల్లో విద్యావకాశాలు లభిస్తాయి. కళా, క్రీడా రంగాల్లో వారు అనుకోని గుర్తింపు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యత్నం ఫలిస్తుంది. 
 
కుంభం: ఉద్యోగయత్నంలో బిడియం, భేషజం తగదు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. దైవ, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. వృత్తి వ్యాపారులు ఊపందుకుంటాయి. ఇంటాబయటా అనుకూలతలుంటాయి. బంధుమిత్రులకు సహాయ సహకారాలందిస్తారు.  
 
మీనం: మీ ఇష్టాయిష్టాలను నిర్మొహమాటంగా తెలియజేయండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశం లభిస్తుంది. రిటైర్డు ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ అందుతాయి. అధికారులకు తరచు పర్యటనలు, ఒత్తిడి అధికమవుతుంది. గృహ నిర్మాణాలు చురుకుగా సాగుతాయి.