మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (17:37 IST)

28-01-2020 మంగళవారం దినఫలాలు - కార్తికేయుడిని పూజించినా (video)

మేషం : వైద్యులకు శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వంటి చికాకులను ఎదుర్కొంటారు. ప్రేమికుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. మీపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యల ప్రభావం అధికం. రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. కోర్టు వ్యవహారాలలో ఫ్లీడర్లకు పురోభివృద్ధి. 
 
వృషభం : బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. స్త్రీలు అపరిచితులతో మితంగా సంభాషించండి. 
 
మిథునం : వృత్తుల వారు ఆదాయం కంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. రాబడికి మించిన ఖర్చులెదురవుతాయి. రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేట్ సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. కొంతమంది మీతో సన్నిహితంగా ఉంటూనే చాటుగా అపకారం తలపెట్టేందుకు యత్నిస్తారు. 
 
కర్కాటకం : విదేశీయానం, రుణయత్నాల్లో ఆటంకాలు, చికాకులు తప్పవు. జీవిత భాగస్వామితో తలెత్తిన వివాదాలు క్రమేణా సమసిపోతాయి. బంధువులను కలుసుకుంటారు. హోటల్, తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల ఒత్తిళ్ళలో శ్రమాధిక్యత ప్రయాసలు వంటివి ఎదుర్కొంటారు. 
 
సింహం : పత్రికా, మీడియా రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలెదురైనా మొండిగా పూర్తిచేస్తారు. వ్యాపార వర్గాల వారికి చెక్కుల జారీ, పెద్ద మొత్తంలో స్టాక్ ఉంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రచయితలకు పత్రికా రంగంలో వారికి కీర్తి, గౌరవారు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
కన్య : మీ యత్నాల్లో పొరపాట్లు దొరే ఆస్కారం ఉంది. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. మీ మాటకు సర్వత్రా ఆమోదం లభిస్తుంది. స్త్రీలకు ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి. ప్రముఖులు, అయినవారిని కలుసుకుంటారు. 
 
తుల : కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత ఎంతో అవసరం. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. చర్చలలో కొన్ని లోపాలు తలెత్తుట వల్ల రాజకీయాలలో వారికి ఆందోళన అధికమవుతుంది.
 
వశ్చికం : ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికం అవుతున్నారని గమనించండి. కొబ్బరి, పండ్లు, పూలు, వస్తు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవడం మంచిది. 
 
ధనస్సు : ఖర్చులు అదుపుకాకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. రవాణా రంగాల వారికి మెళకువ, ఏకాగ్రత అవసరం. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. స్త్రీలు ఆడంబరాలకు పోయి సమస్యలు తెచ్చుకోకండి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి పనిభారం వల్ల ఆరోగ్యంలో చికాకులు తప్పవు. 
 
మకరం : గృహంలో ఒక శుభకార్యానికి యత్నాలు ఆరంభిస్తారు. స్త్రీలకు అలంకారాలు, విలాసవస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అక్రమ సంపాదనపై దృష్టిపెట్టకపోవడం మంచింది. మీ ప్రతిభ, పనితీరులకు మంచి గుర్తింపు పొందుతారు. రుణయత్నాల్లో అనుకూలతలుంటాయి. ఏ పని సవ్యంగా సాగత నిరుత్సాహం కలిగిస్తుంది. 
 
కుంభం : ఉద్యోగుల సమర్థతకు మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ఖర్చులు, కుటుంబ అవసరాలు అధికమవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించండి. కొత్త వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆత్మీయులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
 
మీనం : తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలకు మార్గం సుగమమవుతుంది. బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు, బిల్డర్లు కొత్త పనుల చేపడతారు. ఆస్తి వ్యవహారాల్లో అవరోధాలు తొలగిపోతాయి.