శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శనివారం, 29 జూన్ 2019 (09:12 IST)

29-06-2019 శనివారం దినఫలాలు - సన్నిహితుల నుంచి ఆశించిన సాయం...

మేషం: హోటల్, తినుబండారాల వ్యాపారులకు అనుకూలం. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాల్లో మార్పులు వుండవు. దూకుడుగా వాహనం నడిపి ఇబ్బందులకు గురవుతారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాల్లో మార్పులు వుండవు. దూకుడుగా వాహనం నడిపి ఇబ్బందులకు గురవుతారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఓర్పుతో అనుకున్న పనులు సాధిస్తారు. 
 
వృషభం: ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో విషయంలో పునరాలోచన మంచిది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మార్కెట్ రంగాల వారికి లాభదాయకమైన అవకాశం కలిసివస్తుంది. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. 
 
మిథునం: నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, మధ్యవర్తుల పట్ల అప్రమత్తత అవసరం. బ్యాంకు వ్యవహారాల్లో జాగురూకతతో మెలగండి. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూల కోసం అధిక సమయం వేచి చూడాల్సి వస్తుంది. రావలసిన బకాయిలు వాయిదా పడటం వలన చికాకులు తప్పవు. 
 
కర్కాటకం: మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. సినిమా, కళారంగాల్లో వారికి ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు.
 
సింహం: ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థవంతంగా పరిష్కరిస్తారు. బ్యాంకు వ్యవహారాల్లో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. స్త్రీలకు స్వీయ ఆర్జన, విలాసవస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. ప్రత్యర్థులను సైతం మీ వైపునకు తిప్పుకుంటారు. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. 
 
కన్య: వ్యాపార లావాదేవీలు, ట్యాక్స్ వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పురోభివృద్ధి. పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లకు చికాకులు అధికం. కొత్త పనులు చేపట్టకుండా  ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. పత్రికా సంస్థల్లోని వారికి చిన్న చిన్న పొరపాట్లు దొర్లే ఆస్కారం వుంది. 
 
తుల: దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన వస్తువులు, వాహనాలు కొంటారు. సన్నిహితుల నుంచి ఆశించిన సాయం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. రావలసిన ధనం అందడంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి.
 
వృశ్చికం: ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు, ప్రదేశాలకు అలవాటు పడతారు. కుటుంబానికి కావలసిన వస్తువులు సమకూర్చుకుంటారు. వాహన చోదకులు, యజమానులు అప్రమత్తంగా వుండాలి. శారీరక శ్రమ, విశ్రాంతి లోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. మిమ్ములను వ్యతిరేకించిన వారే మీ సాన్నిత్యం కోరుకుంటారు. 
 
ధనస్సు: స్త్రీల ఆరోగ్య భంగం, వైద్య సేవలు అవసరమవుతాయి. వాతావరణంలోని మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. కుటుంబీకుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ప్రముఖుల గురించి ఆందోళన చెందుతారు. ఇతరులకు పెద్ద మొత్తాలలో ధనసహాయం చేసే విషయంలో లౌకికం ఎంతో అవసరం.
 
మకరం: విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ సంతానం ప్రేమ వ్యవహారం చర్చనీయాంశమవుతుంది. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. స్త్రీలకు అయిన వారి నుంచి ఆహ్వానం అందుతుంది. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి.
 
కుంభం: స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పెద్దమొత్తం ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్త వహించండి. కోర్టు వ్యవహారాల్లో నిరుత్సాహం కానవస్తుంది. సమాచార లోపం వల్ల నిరుద్యోగులు ఒక అవకాశాన్ని జారవిడుచుకుంటారు. కొన్ని విషయాల్లో మీ అంచనాలు, నమ్మకం వమ్ము అయ్యే ఆస్కారం వుంది. 
 
మీనం: ఉన్నతస్థాయి అధికారులకు కిందిస్థాయి ఉద్యోస్తులతో సంయమనం పాటించడం మంచిది. ధనవ్యయంలో ఆచితూచి వ్యవహరించండి. ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. ఇతరుల వ్యక్తిగత విషయాలకు దూరంగా ఉండటం మంచిది.