బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : సోమవారం, 22 జనవరి 2018 (09:41 IST)

సోమవారం మీ దినఫలాలు .. లౌక్యంగా వ్యహరించడం... (వీడియో)

మేషం : ఉద్యోగస్తులు ధనప్రభావానికి దూరంగా ఉండటం మంచిది. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేస్తారు. స్త్రీలకు వస్తు, వస్త్ర ఆభరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తా

మేషం : ఉద్యోగస్తులు ధనప్రభావానికి దూరంగా ఉండటం మంచిది. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేస్తారు. స్త్రీలకు వస్తు, వస్త్ర ఆభరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలనిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. 
 
వృషభం : అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ఉద్యోగయత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. ప్రభుత్వ కార్యక్రమాలలోని పనులు సజావుగా సాగుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. 
 
మిథునం : కంప్యూటర్, అకౌంట్స్ రంగాల వారికి చికాకులు తప్పవు. వ్యాపారాల పట్ల ఆసక్తి అధికమవుతుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి, శ్రద్ధ చాలా అవసరం. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. బంధు మిత్రులను కలుసుకుంటారు. 
 
కర్కాటకం : మీ శ్రీమతి వైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ప్రముఖుల కలయికతో పనులు సానుకూలమవుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యహరించండి. ఉపాధ్యాయులు బాధ్యతలకు అధికం. హామీలు, చెక్కులిచ్చే విషయంలో జాగ్రత్త అవసరం. 
 
సింహం : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. వైద్యులు ఆపరేషన్లు చేయునపుడు జాగ్రత్త అవసరం. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వస్తువుల పట్ల మెళకువ అవసరం. శత్రువులు మిత్రులుగా మారుతారు. 
 
కన్య : కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. రాజకీయ నాయకులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కార్యాలయంలోని సమస్యలు తలెత్తినా సమసిపోగలవు. సోదరులతో ఏకీభవించలేకపోతారు. బ్యాంకు లావాదేవీలు చికాకు పరుస్తాయి. కటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు ఆనందాన్నిస్తుంది. 
 
తుల : పత్రికా సంస్థలలోని వారికి పునఃపరిశీలన ముఖ్యం. ఉపాధ్యాయులకు వృత్తిపరంగా గౌరవ మర్యాదలు లభిస్తాయి. విదేశీయాన సంబంధమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. పూర్వపు అప్పులు కొన్ని తీర్చెదరు. వృద్దాప్యంలో ఉన్నవారికి శారీరక బాధలు సంభవిస్తాయి. ప్రియతములతో షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. 
 
వృశ్చికం : మీ పొదుపరితనం కుటుంబ సభ్యులకు చికాకు కలిగిస్తుంది. తలపెట్టిన పనుల్లో కొంతముందు వెనుకలుగానైనా సంతృప్తి కానరాగలదు. స్త్రీలకు టీవీ చానెళ్ల కార్యక్రమాల సమాచారం అందుతుంది. కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. బ్యాంకు లావాదేవీలు చికాకు పరుస్తాయి. 
 
ధనస్సు : విదేశీయాన సంబంధమైన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలు పనివారితో, సంతానంతో చికాకులను ఎదుర్కొంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మిర్చి, కంది, మినుము, ధాన్యం వ్యాపారులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. 
 
మకరం : విద్యార్థులు కళాత్మక, క్రీడాపోటీలలో విజయం సాధిస్తారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కొన్ని నిర్భందాలకు లోనవక తప్పదు. ప్రేమా అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. 
 
కుంభం : పారిశ్రామిక రంగాల్లో వారు స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ సంతృప్తికానవస్తుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. కోర్టు వ్యవహారాలు, పాత సమస్యలు చికాకు పరుస్తాయి. ఏదైనా అమ్మకానికై చేయుయత్నంలో పునరాలోచన అవసరం. 
 
మీనం : విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. కాంట్రాక్టర్లు అతి కష్టంమ్మీద టెండర్లను చేజిక్కించుకుంటారు. మీరు అమితంగా అభిమానించే వ్యక్తులతో ఉల్లాసంగా గడుపుతారు. బ్యాంకింగ్ రంగాల్లో వారికి ఓర్పు, నేర్పు చాలా అవసరం. సోదరీ, సోదరుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి.