శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2017 (05:39 IST)

ఈ రోజు మీ రాశి ఫలితాలు 1-8-2017.... ఇలా వున్నాయి...

మేషం : ఈరోజు సొంతంగా వ్యాపారం, సంస్థలు నెలకొల్పాలనే మీ ఆలోచన బలపడుతుంది. మీ సంతానం కోసం ఫీజులు, బిల్లులు, చెల్లిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. నిరుద్యోగులు చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడం

మేషం : ఈరోజు సొంతంగా వ్యాపారం, సంస్థలు నెలకొల్పాలనే మీ ఆలోచన బలపడుతుంది. మీ సంతానం కోసం ఫీజులు, బిల్లులు, చెల్లిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. నిరుద్యోగులు చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడం మంచిది. స్నేహ బృందాలు అధికమవుతాయి. క్రీడా, కళా రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు.
 
వృషభం : మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం. ఖర్చులు మీ స్థోమతకు తగినట్టుగానే ఉంటాయి. కొబ్బరి, పండ్లు, పూల, వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
మిథునం : బ్యాంకు వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు వ్యాపారులకు చికాకులు తప్పవు. మీ కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు పనిభారం అధికం.
 
కర్కాటకం : ఫైనాన్స్, వ్యాపారాలు మొండి బాకీల మీద దృష్టి ఉంచండి. దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు ఊహించని చికాకులు ఎదురవుతాయి.
 
సింహం : హామీ, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. రాజకీయ నాయకులకు కొంత అనుకూల వాతావరణం నెలకొంటుంది. ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. నిరుద్యోగులకు కలిసివచ్చే కాలం. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ఆదాయానికి మంచి ఖర్చులుంటాయి.
 
కన్య : తలపెట్టిన పనులు ఏ మాత్రం ముందుకు సాగవు. ఖర్చులు అధికంగా ఉన్నా మీ అవసరాలు నెరవేరుతాయి. పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ధనం ఏ కొంతైనా పొదువు చేయాలన్న మీ యత్నం ఫలించదు. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబీకులతో ఏకీభవించలేరు.
 
తుల : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగాలవారికి ఆశాజనకం. సహోద్యోగులతో సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఉమ్మడి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. బ్యాంకు పనులు వాయిదా పడతాయి. కుటుంబీకులతో అవగాహనా లోపం వంటివి ఎదుర్కొంటారు. వాహనం కొనుగోలుకై చేయు యత్నాలు ఫలిస్తాయి.
 
వృశ్చికం : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కరిస్తారు. గృహ నిర్మాణాలలో స్వల్ప అడ్డంకులు, చికాకులు ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు అవకాశాలను చేజార్చుకుంటారు. మీ శ్రీమతి ప్రోద్బలంతో కొత్త యత్నాలు మొదలెడతారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపడుతారు. అవివాహితులకు అనూకూలమైన కాలం.
 
ధనస్సు : ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ఇంటర్వ్యూలలో శ్రద్ధ వహించండి. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. విద్యార్థుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. కుటుంబంలో ప్రశాంతత చోటుచేసుకుంటుంది. స్త్రీలు, దైవ, సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
 
మకరం : మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. వాహనం, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. అకాలభోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. సమయానికి మిత్రుల సహకరించకపోవడంతో అసహనానికి గురవుతారు.
 
కుంభం : ఆర్థిక విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది.
 
మీనం : ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. కోర్టు వ్యవహరాల్లో ఫ్లీడర్లు తీరు ఆందోళన కలిగిస్తుంది. క్రీడా రంగాల్లోని వారికి చికాకులు తప్పవు. సోదరీ, సోదరుల మధ్య కలహాలు తలెత్తుతాయి. ఇతరుల వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.