suvichar

మూడు రాత్రులు నేల మీద నిద్రించి.. గోమాతను దానం చేస్తే..?

Updated: గురువారం, 7 మార్చి 2019 (14:44 IST)
గోమాతను పూజించడం ద్వారా కోటి పుణ్యల ఫలం పొందవచ్చు. కన్నతల్లి తర్వాత గోవునే మాతగా పిలుస్తారు. అలాంటి గోవును దానం చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలను పొందవచ్చో చూద్దాం.. ప్రతి ఒక్కరూ జీవితకాలంలో మూడు గోవులను దానంగా చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇలాచేస్తే పుణ్యఫలంతో పాటు సమస్త దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 
 
ముఖ్యంగా మరణానంతరం 'వైతరణి' నదిని దాటే క్రమంలో అత్యంత కష్టతరమైన ప్రయాణం చేయకుండా ఈ పుణ్య ఫలం అడ్డుపడుతుంది. ఇక గోవును దానం చేయడం వలన, కొన్ని వేల సంవత్సరాల పాటు పితృదేవతలు ఉత్తమ గతులను పొందుతారని శాస్త్రాలు చెప్తున్నాయి. 
 
గోదానం ద్వారా దారిద్ర్యం తొలగిపోతుంది. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అనారోగ్యాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు వుండవు. వంశాభివృద్ధి చేకూరుతుంది. అలాంటి గోదాన ప్రాధాన్యాన్ని అంపశయ్యపై వున్న భీష్ముడు ధర్మరాజుకు వివరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. 
 
శుభసమయాల్లో గోదానం చేయడం ద్వారా పుణ్యగతులను పొందవచ్చునని.. మూడు రాత్రులు నేల మీద నిద్రించి.. గోదానం చేయాలి. కేవలం నీటిని మాత్రం సేవించి ఉపవాసం వుండి.. గోదానం చేస్తే మంచి ఫలితాలుంటాయి. దూడలను కూడా దానం చేస్తే.. ఉత్తమ ఫలితాలను పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 

అన్నీ చూడండి

విశాఖపట్నం సెంట్రల్ పార్క్ బయట కరెన్సీ నోట్లు

ప్రధాని మోడీ స్కూల్‌మేట్ భూవివాదం పరిష్కారం...

ఇంట్లో పేదరికం తాండవిస్తున్నా.. ఒకే ఇంట్లో ఐదుగురు డాక్టర్లు అయ్యారు.. ఎక్కడ?

డీఎస్సీ-2025 కుంభకోణానికి చంద్రబాబు బాధ్యత వహిస్తారా?: జగన్

అక్టోబరు 15 నుంచి యూపీఐ సేవలు భారం కానున్నాయా?

అన్నీ చూడండి

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభం

15-09-2026 రాశి ఫలితాలు, ఎవరినీ అతిగా విశ్వసించవద్దు

ఆ భయమే మనిషి మనశ్శాంతిని హరించివేస్తుంది: శ్రీ కృష్ణ పరమాత్మ

తర్వాతి కథనం
Show comments